Monday, April 29, 2024

ధరణి దరఖాస్తుల గడువు పొడిగింపు

- Advertisement -
- Advertisement -

ఈ నెల 17వ తేదీ వరకు మిగిలిన దరఖాస్తులకు మోక్షం

మనతెలంగాణ/హైదరాబాద్ : ధరణి దరఖాస్తుల పరిశీలన గడువును ఈ నెల 17వ తేదీ వరకు పొడిగిస్తూ సోమవారం అధికారిక ఉత్తర్వులు జారీ అయ్యాయి. ధరణి పెండింగ్ దరఖాస్తులకు సంబంధించిన స్పెషల్ డ్రైవ్ ఈ నెల 1 నుంచి 9వ తేదీ వరకు నిర్వహించి పరిష్కారించింది. అయితే ఈ డ్రైవ్‌లో భాగం గా ఇప్పటి వరకు 1.06 లక్షల దరఖాస్తులకుపై గా రెవెన్యూ బృందాలు క్షేత్రస్థాయిలో పరిశీలించాయి.

ఇక పెండింగ్ దరఖాస్తుల పరిశీలనకు తహశీల్దార్ కార్యాలయం సిబ్బందిని ప్ర త్యేక బృందాలుగా నియమించారు. ఈ బృందాలు ప్రస్తుతం ధరణి పెం డింగ్ దరఖాస్తులకు సంబంధించిన రికార్డులను పరిశీలిస్తూ, ఫీల్డ్‌లో దరఖాస్తుదారుడు ఉన్నాడా.. లేదా? అ న్నది నిర్ధారించుకునేందుకు క్షేత్ర స్థాయి సర్వే చేపట్టాయి. ధరణి పోర్టల్లో ఆర్డీఓలు, తహశీల్దార్‌లకు లాగిన్ ఆదేశాలు రాగానే పెండింగ్ దరఖాస్తులకు సంబంధించి ఆన్‌లైన్ వర్క్ త్వరలో ప్రారం భం అవుతుందని రెవెన్యూ ఉన్నతాధికారు లు తెలిపారు. ఈ క్ర మంలో మరోసారి ప్రభు త్వం పరిశీలన గడువును పెంచడం బాధితులకు కాస్త ఉపశమనం కలిగిస్తోంది.

 

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News