Tuesday, April 30, 2024

మోడీ రాష్ట్ర పర్యటన

- Advertisement -
- Advertisement -

7, 11 తేదీల్లో తెలంగాణకు రాక

బిసి ఆత్మగౌరవ సభ, మాదిగ విశ్వరూప మహాసభకు హాజరు
నాలుగు జిల్లాలో సభ ఏర్పాట్లకు రాష్ట్ర నాయకత్వం ప్లాన్

మన తెలంగాణ/హైదరాబాద్: రాష్ట్ర శాసనసభ ఎన్నిక ప్రచారానికి ప్రధానమంత్రి నరేంద్ర మోదీ రానున్నారు. ఈనెల 7, 11 తేదీల్లో బీజేపీ నిర్వహించే బీసీ ఆత్మగౌరవ సభ, మాదిగ విశ్వరూప మహా సభల్లో పాల్గొననున్నారు. హైదరాబాద్, కరీంనగర్, ఆదిలాబాద్, నల్గొండ జిల్లాల్లో సభలు నిర్వహించేందుకు రాష్ట్ర నాయకత్వం ప్లాన్ చేస్తోంది. రాష్ట్రంలో అధికారంలోకి వస్తే బిసి ముఖ్యమంత్రిని చేస్తామని ప్రకటించిన తరువాత ప్రధాని రాష్ట్రానికి రానుండటంతో భారీ ఎత్తున బహిరంగ సభలు నిర్వహిస్తోంది. బిజెపి బస్సు యాత్రను రద్దు చేసి వాటి స్థానంలో బిసి బహిరంగ సభలను నిర్వహించనున్నామని గత నెలలోనే రాష్ట్ర నాయకత్వం పేర్కొంది.

ఈనెల 15 నుంచి నిర్వహించే ఎన్నికల ప్రచారం కోసం జాతీయ నాయకత్వం రాష్ట్ర పార్టీకి మూడు హెలికాప్టర్లను సమకూర్చింది. ఒకటి పూర్తిగా బండి సంజయ్‌ కుమార్‌కు కేటాయించగా… మరో రెండు కిషన్ రెడ్డి, లక్ష్మణ్, ఈటల రాజేందర్‌లతో పాటు ముఖ్య నేతల ప్రచారానికి వినియోగించనున్నట్లు పార్టీ వర్గాలు వెల్లడిస్తున్నాయి. జాతీయ ప్రధానకార్యదర్శి హోదాలో బండి సంజయ్ రాష్ట్రవ్యాప్తంగా ప్రచారం నిర్వహించేందుకు వీలుగా ప్రత్యేకంగా ఒక హెలికాప్టర్‌ను ఇచ్చినట్లు పార్టీ శ్రేణులు తెలిపాయి.

26 రోజులు దూకుడుగా ప్రజల్లోకి వెళ్లాలని రాష్ట్ర బిజెపి నాయకత్వం వ్యుహాలకు పదును పెట్టింది. గత నెలలో ప్రధాని మోడీ తెలంగాణ పర్యటనకు చేపట్టి నిజామాబాద్, మహబూబ్ నగర్‌లో జరిగిన బహిరంగ సభలలో పాల్గొని పార్టీ శ్రేణులకు నూతన ఉత్తేజాన్ని ఇచ్చారు. అప్పటి నుంచి బిజెపి బలంగా ప్రజల్లోకి వెళ్లింది. అలాగే జాతీయ బీజేపీ అధ్యక్షుడు జెపి నడ్డా, కేంద్రమంత్రులు అమిత్ షా, రాజ్‌నాథ్ సింగ్ ఇప్పటికే పలుమార్లు రాష్ట్రంలో పర్యటించారు. తెలంగాణలో ఈసారి ఎలాగైనా అధికారం దక్కించుకోవాలని భారతీయ జనతా పార్టీ ప్రజల ముందుకు వెళ్లుతుంది.

 

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News