Sunday, April 28, 2024

ప్రైవేటు టీచర్ల ఆడ్మిషన్ల తంటాలు…..

- Advertisement -
- Advertisement -

ఈనెలాఖరులోగా 15 మంది పిల్లలను చేర్పించాలి
టార్గెట్ పూర్తి చేయకుంటే ఉద్యోగానికి ఎసరు
విద్యార్ధి సంఘాలను ఆశ్రయిస్తున్న పలు ఉపాధ్యాయులు

 Private teacher admissions target
మన తెలంగాణ,సిటీబ్యూరో: గ్రేటర్ నగరంలో ప్రైవేటు విద్యాసంస్దలు గత నెల రోజు నుంచి నూతన ఆడ్మిషన్ల కోసం తంటాలు పడుతున్నారు. ఈనెలాఖరులో ఉపాధ్యాయులంతా 15 మంది కొత్త విద్యార్ధులను చేర్చించాలని టార్గెట్ పెట్టి తాము సూచించిన విధంగా చేయకపోతే ఉద్యోగానికి భరోసాలేమని హెచ్చరికలు చేస్తున్నట్లు పలువురు టీచర్లు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. తాము నివసించే కాలనీ, అపార్టుమెంట్లు తిరుగుతూ తమ స్కూళ్లలో మీపిల్లలను చేర్పించాలని కోరుతున్నారు. మరికొందరు విద్యార్ధి సంఘాల నాయకులను ఆశ్రయిస్తూ తమకు యాజమాన్యం పెట్టి ఆడ్మిషన్లు పూర్తి చేసేందుకు తమ సహకరించాలని కోరుతున్నారు. తమకు విద్యార్దికి ఇచ్చే రూ. 6వేల కమిషన్ల పూర్తిగా మీకే ఇస్తామని చెబుతున్నారు.

కరోనా నేపథ్యంలో రెండు సంవత్సరాలు విద్యాసంస్దలు ఆశించిన స్దాయితో లాభాలు రాకపోవడంతో ఈవిద్యాసంస్ద పెద్ద ఎత్తున విద్యార్ధులను చేర్చుకుని నష్టాలు పూర్తి చేసుకోనే వెంటలో పడట్లు పాఠశాలల సిబ్బంది పేర్కొంటున్నారు. తమను ఏసమయంలో ఉద్యోగం నుంచి తొలగిస్తారనే భయంతో ఆడ్మిషన్ల కోసం పడరాని పాట్లు పడుతున్నారు. జిల్లాలో 1845 ప్రైవేటు స్కూళ్లు ఉండగా ప్రతి ఏటా 7 నుంచి 8లక్షల మంది విద్యార్ధులు విద్యనభ్యసిస్తున్నారు. ఈసారి ప్రభుత్వ పాఠశాల్లో విధులు నిర్వహించే ఉపాధ్యాయులతో స్టార్‌హోటల్‌లో సమావేశాలు నిర్వహించి మీ స్కూళ్లో చదివే విద్యార్ధులను తమ సంస్దలో చేరాలే ఆఫర్లు ఇస్తూ ముందుకు రూ. 10వేల అడ్వాన్సులు ఇస్తూ తమ సంస్ద అభివృద్ది కోసం సహాకారం అందించాలని కోరుతున్నట్లు సర్కార్ పంతుళ్లు వెల్లడిస్తున్నారు.

ప్రైవేటు పాఠశాలలు ఎత్తుగడలకు ప్రభుత్వ స్కూళ్లలో విద్యార్ధుల సంఖ్య తగ్గుముఖం పడుతుందని విద్యార్థి సంఘాలు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. శివారు ప్రాంతాల్లో పేరుమోసిన పలు ప్రైవేటు స్కూళ్లు ముందుస్తుగా ఆడ్మిషన్లు చేపట్టి కోట్లాది రూపాయలు మూట్టగట్టుకునేందుకు ప్రయత్నాలు చేస్తున్నారని స్దానిక రాజకీయ నాయకులు విమర్శలు చేస్తున్నారు. కొంతమంది ప్రజా ప్రతినిధులకు భాగస్వామం ఇస్తూ విద్యాశాఖ అధికారులు తమవైపు చూడకుండా కాపాడాలని కోరుతున్నట్లు పేర్కొంటున్నారు. విద్యాశాఖ నిబంధనల ప్రకారం జూన్‌లో ఆడ్మిషన్లు తీసుకోవాల్సిన సంస్దలు ఆరునెలల ముందే తీసుకోవడంపై అధికారులు చర్యలు తీసుకోవాలని సూచిస్తున్నారు. దీంతో ప్రభుత్వ పాఠశాలల వైపు విద్యార్థులు ఎవరు వెళ్లరని, నగరంలో అన్ని పాఠశాలలకు ఒకే రూల్స్ వర్తించేలా చూడాలని కోరుతున్నారు.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News