Monday, May 6, 2024

మా కుటుంబానికి పోరాట సమయం

- Advertisement -
- Advertisement -

చిక్కమగళూరు: కాంగ్రెస్ ప్రధాన కార్యదర్శి ప్రియంకగాంధీ చిక్కమగళూరు పర్యటనలో భావోద్వేగానికి గురయ్యారు. చిక్కమగళూరు ప్రజలతో తమ కుటుంబానికి ఉన్న అనుబంధాన్ని బుధవారం ఆమె గుర్తు చేసుకున్నారు. దాదాపు 45ఏళ్ల క్రితం నానమ్మ, మాజీ ప్రధాని ఇందిరాగాంధీ ప్రాంతం నుంచి పోటీ చేసినట్లు తెలిపారు. తన సోదరుడు, కాంగ్రెస్ నేత రాహుల్‌గాంధీని పార్లమెంటుకు అనర్హులుగా ప్రకటించడాన్ని ఇందిరాగాంధీకి జరిగిన బూటకపు కేసులాంటిదే అన్నారు.\

Also Read: తెలంగాణలో కాంగ్రెస్ అధికారంలోకి రావడం ఖాయం

దేవుడు, ప్రజల ఆశీస్సులతో తాము పోరాడుతున్నామని విజయం సాధిస్తామని విశ్వాసం వ్యక్తం చేశారు. తను శారదాదేవి శారదాంబ దేవి)కి ప్రార్థనలు చేసినట్లు తెలిపారు. అక్కడ శంకరాచార్యులు(ప్రస్తుత మఠాధిపతి)ని కలిశాను. ఇందిరాగాంధీ ఇక్కడ నుంచి పోటీచేసిన విషయాన్ని ఆయన గుర్తు చేసి తనను ఆశీర్వదించారన్నారు. తన అన్న రాహుల్‌కు దీవెనలందించినట్లుగా శృంగేరి పీఠాన్ని సందర్శించిన అనంతరం ప్రియాంకగాంధీ తెలిపారు.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News