Tuesday, May 7, 2024

సమస్యలను పరిష్కరించాలి

- Advertisement -
- Advertisement -

పాల్వంచ : ఐటిడిఏ పరిధిలో గల పాద్యాయుల సమస్యలను తక్షణమే పరిష్కరించాలని టిఎస్ యుటిఎఫ్ రాష్ట్ర కార్యదర్శి బి. రాజు డిమాండ్ చేశారు. పట్టణంలో గల ఆశ్రమ పాఠశాలలో ఐటిడిఏ ఉపాధ్యాయుల సమావేశం టిఎస్ యుటిఎఫ్ జిల్లా అధ్యక్షుడు బి.కిషోర్ సింగ్ అధ్యక్షతన ఆదివారం నిర్వహించారు. ఈ సందర్భంగా రాజు మాట్లాడుతూ… ఆశ్రమ పాఠశాలల్లో నెలకొన్న సమస్యలను పరిష్కరించాలన్నారు. మౌలిక వసతులు కొరత లేకుండా చూడాలన్నారు. విద్యార్థుల సంఖ్యకు అనుగుణంగా ఉపాధ్యాయులను ఏర్పాటు చేయాలన్నారు.

అనంతరం సమస్యల పరిష్కారం కోసం ప్రత్యేక కమిటీని ఎన్నుకొన్నారు. కన్వీనర్‌గా తేజావత్ బాలు, కో కన్వీనర్‌గా బి. భాస్కర్, కే. సుబ్బారావు, డి. సురేష్, బాలస్వామి, అనసూయ లతో పాటుగా మరో ఇరవై మందిని ఏకగ్రీవంగా ఎన్నుకొన్నారు. ఈ కార్యక్రమంలో జిల్లా ప్రధాన కార్యదర్శి ఎన్. క్రిష్ణ, కోశాధికారి ఎస్‌వి, జయరాజు, రాము, సీతారామయ్య, భాస్కర్, తావుర్యా, బాలు, వీరస్వామి, హరి, పాల్వంచ మండల బాద్యులు రాంబాబు, వెంకన్న తదితరులు పాల్గొన్నారు.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News