Friday, May 3, 2024

జలమండలిలో 182 మంది ఉద్యోగులకు పదోన్నతి

- Advertisement -
- Advertisement -

హైదరాబాద్ ః జలమండలిలోని పలు విభాగాల పరిధిలో వివిధ హోదాల్లో పనిచేస్తున్న 182 మంది ఉద్యోగులకు పదోన్నతి లభించింది. వారి వారి విద్యార్హతలను ఆధారంగా 179 మంది జనరల్ పర్పస్ ఎంప్లాయి (జీపీఈ)లకు స్పెషల్ పర్పస్ ఎంప్లాయి (ఎస్పీఈ)గా, జూనియర్ టెక్నికల్ ఆఫీసర్ (జేటీవో) గా పనిచేస్తున్న ముగ్గురికి అసిస్టెంట్ టెక్నికల్ ఆఫీసర్లు (ఏటీవో) లుగా పదోన్నతి కల్పించారు. వీరికి ఖైరతాబాద్ లోని ప్రధాన కార్యాలయంలో శనివారం జరిగిన కార్యక్రమానికి ముఖ్య అతిథులుగా ఎండీ దానకిశోర్ తో పాటు వాటర్ వర్క్ ఎంప్లాయిస్ యూనియన్, తెలంగాణ అధ్యక్షుడు రాంబాబు యాదవ్ హాజరయ్యారు.

వారికి నియామక పత్రాలు అందజేసి శుభాకాంక్షలు తెలిపారు.ఈసందర్భంగా ఎండీ మాట్లాడుతూ వాటర్ బోర్డులో ఉద్యోగం చేయడం సవాలుతో కూడిందని అన్నారు. పదోన్నతులు పొందిన వారంతా బోర్డుకు ఎలాంటి మచ్చ రాకుండా పని చేయాలని సూచించారు. యూనియన్ అధ్యక్షుడు రాంబాబు యాదవ్ మాట్లాడుతూ 28 ఏళ్ల నుంచి ఒక్కసారి కూడా పదోన్నతి రాని వాళ్లకు నేడు ప్రమోషన్ వచ్చిందన్నారు. దీని కోసం కృషి చేసిన ఎండీ దానకిశోర్ కు కృతజ్ఞతలు తెలిపారు. ప్రమోషన్లు పొందిన వారు ప్రజలకు మంచి సేవలందించి, బోర్డు అభివృద్ధికి కృషి చేయాలని కోరారు.

అనంతరం ఇటీవల రాష్ట్ర కనీస వేతనాల సలహా మండలికి ఛైర్మన్ గా ఎంపికైన యూనియన్ వర్కింగ్ ప్రెసిడెంట్ పి.నారాయణకు ఎండీ శుభాకాంక్షలు తెలిపి అభినందించారు. ఈ కార్యక్రమంలో ప్రాజెక్టు డైరెక్టర్ శ్రీధర్ బాబు, సీజీఎంలు మహమ్మద్ అబ్దుల్ ఖాదర్, వినోద్ భార్గవ, వాటర్ వరక్స్ ఎంప్లాయిస్ యూనియన్ అసోసియేట్ ప్రెసిడెంట్ రాజిరెడ్డి, వర్కింగ్ ప్రెసిడెంట్లు అక్తర్, లక్ష్మీ నారాయణ, జనరల్ సెక్రటరీ జయరాజ్ తదితరులు పాల్గొన్నారు.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News