Monday, April 29, 2024

రైతులకు సకాలంలో రుణాల అందించి, ప్రభుత్వ లక్ష్యాలను నెరవేర్చాలి

- Advertisement -
- Advertisement -

యాదాద్రి భువనగిరి: బ్యాంకులు సకాలంలో ఋణాలు అందించి ప్రభుత్వ లక్ష్యాలను నెరవేర్చాలని జిల్లా కలెక్టరు పమేలా సత్పథి బ్యాంకర్లకు సూచించారు. మంగళవారం కలెక్టరేట్ మీటింగ్ హాలులో జరిగిన జిల్లా స్థాయి బ్యాంకర్ల సంప్రదింపుల కమిటీ సమావేశానికి ఆమె అధ్యక్షత వహించారు.ఈ సందర్భంగా ఆమె బ్యాంకర్లను ఉద్దేశించి మాట్లాడుతూ,గత మార్చి మాసం వరకు 1269.60 కోట్లు వ్యవసాయ పంట ఋణాలుగా అందచేయడం జరిగిందని, దీనిలోనే వ్యవసాయ దీర్ఘకాలిక ఋణాలుగా 1243.31కోట్లతో మొ త్తంగా వ్యవసాయ రంగానికి 2512.91 కోట్లు బ్యాంకుల ద్వారా ఇవ్వడం జరిగిందని తెలిపారు. వ్యవసాయ ఋణాలను సకాలంలో అ ందించి లక్ష్యాలను సాధించాలని, రైతులు పంట ఋ ణాలు సకాల ంలో చెల్లించేలా అధికారులు క్షేత్ర స్థాయిలో శ్రద్ధ కనబరచాలని ఆదేశించారు.

సూక్ష్మ ఋణాల క్రింద సూక్ష్మ, చిన్న, మ ధ్య స్థాయి పరిశ్రమలకు గాను 401.25 కోట్లు ఇవ్వడం జరిగిందని, విద్యా ఋ ణాలుగా 10.40 కోట్లు, గృహ ఋణాలుగా 53 .28 కోట్లు అందించడం జరిగిందని, అంతే కాకుండా ప్రాధాన్యతా రంగాలకు 37.09 కోట్లు అందించడం జరిగిందని తెలిపారు. ఎస్సీ, ఎస్టీ లబ్దిదారులకు సకాలంలో ఋణాలు అందచేసి లబ్దిదారులకు ప్రయోజనం కల్పించాలని సూచించారు. జిల్లాలో 12747 మహిళా సంఘాలకు 49 5.20 కోట్ల ఋణాలు లక్ష్యంగా పెట్టుకోవడం జరిగిందని, దీనిలో ఇప్పటి వరకు 12747 సంఘాలకు గాను 495.20 కోట్లు అందించి 84.48 శాతం లక్ష్యాన్ని సాధించడం జరిగిందని, అర్హత ఉన్న స ంఘాలకు ఋణాలు వెంటనే అందించాలని, రెన్యువల్‌లో ప్రాసెసి ంగ్ ఫీజు లేకుండా చూడాలని తెలిపారు.

అలాగే వీధి వ్యాపారులకు అందించే 20 వేల రూపాయల ఋణానికి సంబంధించి జిల్లాలో 2 699 వీధి వ్యాపారులకు 19 కోట్ల 36 లక్షల ఋణ సౌకర్యం కల్పించడం జరిగిందని, వీధి వ్యాపారులకు మొదటి విడుత పది వేలు సకాలంలో చెల్లించిన వారికి రెండవ విడుతగా 20 వేలు సత్వరమే అందించాలని, పి.ఎం.ఇ.జి.పి., పి.ఎం.ఎఫ్.ఎం.ఇ. ఋణాలు లబ్దిదారులకు సకాలంలో అందించాలని సూచించారు. పాడి, మత్స్య ప రిశ్రమలకు సంబంధించి లబ్దిదారులకు కిసాన్ క్రెడిట్ ఋణాలు స కాలంలో ఇవ్వాలని తెలిపారు. రిజర్వు బ్యాంకు సూచనల మేరకు నూరు శాతం ప్రజలకు డిజిటల్ సేవలు అందించేలా కృషి చేయాలని, దీనికి బ్యాంకులు ప్రజలకు తెలిసేలా అవగాహన కార్యక్రమాలు చేపట్టాలని కోరారు.

సంక్షేమ రంగాలకు సంబంధించి ప్రభు త్వ లక్ష్యాలను నెరవేర్చాలని, పథకాలను సకాలంలో గ్రౌండింగ్ చేపట్టి లబ్దిదారులకు మేలు చేకూర్చాలని, సామాజిక బాధ్యతగా వి ద్యా, త్రాగునీటి రంగాలలో బ్యాంకులు సహకారం అందించాలని తె లిపారు. ప్రజలకు, స్వయం సహాయక సంఘాలకు, మెప్మా సం ఘాల మహిళలకు డిజిటల్ ఆర్థిక అక్షరాస్యతపై, జాగ్రత్తలపై, మోసపురిత వ్యవహారాలకు మోసపోకుండా అవగాహన కార్యక్రమాలు నిర్వహించాలని కోరారు. ఎలక్షన్ విధులకు సంబంధించి ఉద్యోగు ల వివరాలను అందించడంలో జిల్లా యంత్రాంగానికి సహకరించాలని తెలిపారు.

నాబార్డు ద్వారా రాబోయే 2023-24 సంవత్సరానికి నిర్దేశించిన వార్షిక ఋణ ప్రణాళికను జిల్లా కలెక్టరు విడుదల చేశా రు.జిల్లాలో 3707.95 కోట్ల ఋణ లక్ష్యంగా నాబార్డు నిర్ణయించిం ది. దీనిలో వ్యవసాయరంగానికి 2236.56 కోట్లు, సూక్ష్య ఋణ ప్ర ణాళికకు 169.01 కోట్లు, విద్యారంగానికి 25 కోట్లు, గృహ నిర్మాణానికి 116 కోట్లు, ఇతర మౌళిక వసతులకు 21 కోట్లు, సోలార్ ఎ నర్జీ సంబంధించి 15 కోట్లు బ్యాంకుల ద్వారా ఇచ్చేందుకు ప్రణాళిక సిద్ధం చేయడం జరిగింది.ఈ సమావేశంలో లీడ్ బ్యాంక్ అధికారి కె. శ్రీరామకృష్ణ, జిల్లా గ్రామీణాభివృద్ధి అధికారి నాగిరెడ్డి, ఆర్బీఐ లీడ్ జిల్లా అధికారి విభవ్ వ్యాస్, నాబార్డు డిడిఎం వినయ్ కుమార్, జి ల్లా పరిశ్రమల అధికారి శ్రీలక్ష్మి, ఇడి ఎస్సీ కార్పొరేషన్ శ్యాంసుంద ర్, జిల్లా పశు వైద్య అధికారి డాక్టర్ కృష్ణ, మెప్మా ్రప్రాజెక్టు డైరెక్టరు రమేశ్, వివిధ బ్యాంకుల ప్రతినిథులు పాల్గొన్నారు.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News