Sunday, April 28, 2024

కరువులో కల్పతరువు కాళేశ్వరం

- Advertisement -
- Advertisement -

ఇటీవల తెలంగాణలో వర్షాభావ పరిస్థితుల వల్ల కాళేశ్వరం ప్రాజెక్టు నుండి రివర్స్ పంపింగ్ ద్వారా శ్రీరామసాగర్ ప్రాజెక్టులోకి నీటిని తోడి పోస్తున్న విధానాన్ని చూసి రైతులు ఆనందోత్సాహాలలో వుండడం చూస్తున్న విషయం తెలిసిందే. శ్రీరామ సాగర్ ప్రాజెక్టులోకి ఎత్తిపోయడం అనేది ఇంటిగ్రేటెడ్ ప్రాజెక్టులో ఒక భాగమే. కాళేశ్వరం ప్రాజెక్టు కట్టినప్పటి నుంచి వర్షాలు భారీగా పడడం ద్వారా ఈ రివర్స్ పంపింగ్ లాభాలు ప్రజలకు తెలియరాలేదు. ఈ ప్రాజెక్టు హైడ్రాలజీ, ఉపయోగాలను ఒకసారి నెమరు వేసుకొంటే ప్రజలకు అర్థమవుతుందని అనిపిస్తుంది.
తెలంగాణ రాష్ట్రంలో 50 శాతం రాబడి వ్యవసాయ రంగాన్నుండి ఇంకా 70 శాతం ప్రజలు వ్యవసాయ ఆధారంగానే జీవనోపాధి పొందుతున్నారు. మన రాష్ట్రంలో వ్యవసాయ అనుకూల ప్రాంతం ఎత్తైన ప్రాంతంలో వుండడం వలన లిఫ్ట్ ఇరిగేషన్ తప్పని పరిస్థితి ఏర్పడింది. అందువలనే ముందు చూపుతో ముఖ్యమంత్రి కెసిఆర్ ఒక భారీ లిఫ్ట్ ఇరిగేషన్ ప్రాజెక్టు నీటి లభ్యత వున్న చోట కట్టవలసిన పరిస్థితి ఏర్పడిందని భావించారు. ఎంతో మేధో మథనం తర్వాత ముఖ్యమంత్రి కెసిఆర్ మేడిగడ్డ వద్ద పుష్కలమైన నీటి లభ్యత కలిగిన ప్రాణహిత ఉపనది సంగమం చోట బ్యారేజ్ నిర్మించడానికి నిర్ణయించడం జరిగినది. ఒక ప్రాజెక్టు కట్టాలంటే నీటి లభ్యత, అంతర్ రాష్ట్ర జల వివాద పరిష్కారం, డ్యాం/ బ్యారేజీ ఎత్తు సమస్యలను అధిగమించాల్సిన అవసరం ఎంతో అవసరం. ఇక్కడ మన ముఖ్యమంత్రిని మెచ్చుకోవలసిన విషయమేమంటే మహారాష్ట్ర ప్రభుత్వాన్ని ఒప్పించి అగ్రిమెంట్‌ను తెలంగాణ రాష్ట్రం ఏర్పడిన అతి కొద్ది కాలంలోనే సాధించడం. ఇక్కడ రెండు విషయాలను ప్రస్తావించవలసిన అవసరం ఎంతైనా అనిపిస్తున్నది. ఒకటి ఆధునిక సాంకేతిక విధానము ఉపయోగించి లిడార్ సర్వే (హెలికాప్టర్ ద్వారా)లో డిపిఆర్‌ను త్వరితగతిన తయారు చేయడం. రెండవది మేడిగడ్డ వద్ద బ్యారేజీ ఎత్తు ప్లస్ 100.00 మీ. కు మహారాష్ట్ర ప్రభుత్వంను ఒప్పించడం. అసలు జిడబ్లుడిటి అవార్డు ప్రకారం ఇచ్చంపల్లి వద్ద ప్రాజెక్టు నిర్మాణాన్ని కనీసం 95.000 మీ చేపట్టుకొందామంటే ఒప్పుకోని మహారాష్ట్ర ప్రభుత్వం ఎగువన మేడిగడ్డ వద్ద ప్లస్ 100.000 మీ. కు ఒప్పించడం కాళేశ్వరం ప్రాజెక్టు నిర్మాణానికి ప్రభుత్వం చేసిన కృషి ఒక విజయంగానే భావించాల్సిందే.
నీటి లభ్యత: మేడిగడ్డ వద్ద ప్రధానంగా పెన్‌గంగ, వార్ధా, మానేరు, మధ్య గోదావరి, ప్రాణహిత నుండే నీటి లభ్యత వుంటుంది. తెలంగాణ ప్రభుత్వం డిపిఆర్ పై నదుల నుండి 282.30 టిఎంసిల నికర జలాలు మేడిగడ్డ వద్ద లభ్యమవుతున్నాయి అని కేంద్ర ప్రభుత్వానికి చెందిన సిడబ్లుసి క్లియరెన్స్ కోసం సమర్పించింది.
కాని, కేంద్ర ప్రభుత్వం డిపిఆర్‌ను క్షుణ్ణంగా తన దగ్గర వున్న నీటి లభ్యత లెక్కలను అనుసరించి, వార్ధా, మానేరు, మధ్య గోదావరి నదులలో ఎలాంటి నీటి లభ్యత లేదని కేవలం పెన్‌గంగ, ప్రాణహిత నదులలోనే 284.30టిఎంసిల నికర జలాలు లభ్యమవుతున్నాయని పేర్కొంటూ కాళేశ్వరం ప్రాజెక్టు డిపిఆర్‌ను ఆమోదించినది.
ఇక్కడ గమనించాల్సిన విషయమేమంటే, ప్రతి లిఫ్ట్ స్కీమ్‌లో నీటి వాడకంలో కనీసం మూడవ వంతు నిల్వ చేసినప్పుడే ఆ స్కీమ్ సక్సెస్ అవుతుందని కేంద్ర ప్రభుత్వ సూచనల మేరకే సుమారు 148 టిఎంసిల నీటి నిల్వ సామర్థం గల రిజర్వాయర్లు నిర్మిస్తుంది. అంతేకాక అటు నిజాంసాగర్, శ్రీరామసాగర్ ప్రాజెక్టుల స్థిరీకరణానికి, కరువు కాలంలో రిజర్వాయర్లను నింపే విధానాన్ని ఖర్చుకు భయపడకుండా నిర్మాణం చేపట్టింది. 4/5 సం॥లలో పుష్కలమైన వర్షాలు పడడం వలన కాళేశ్వరం ప్రాధాన్యత తెలియలేదు. ఈ కరువు కాలంలో మనకు సిద్ధంగా నీటి కాలువల వ్యవస్థ వున్న రె ండు ప్రధాన ప్రాజెక్టులు శ్రీరాం సాగర్, నిజాంసాగర్‌లను ముందు నింపడం ద్వారా ప్రజలకు కాళేశ్వరం ప్రాజెక్టు ప్రాధాన్యత తెలియడం సంతోషం కలిగిస్తుంది.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News