Friday, May 10, 2024

పంజాబ్ కాంగ్రెస్ శాసనసభా పక్షం సమావేశం వాయిదా

- Advertisement -
- Advertisement -

ఛండీగడ్: పంజాబ్ కాంగ్రెస్ శాసన సభాపక్షం(సిఎల్‌పి) సమావేశం ఆదివారం ఉదయం 11.00 గంటలకు జరగాల్సి ఉండగా అదికాస్తా వాయిదా పడింది. కాంగ్రెస్ శాసన సభాపక్షం కొత్త నాయకుడి ఎవరన్న దానిపై ఇంకా ఏకాభిప్రాయం కుదరాల్సి ఉందని పార్టీ వర్గాలు తెలిపాయి. సిఎల్‌పి సమావేశం వాయిదా పడిందని ఓ పార్టీ నాయకుడు వెల్లడించారు.
పంజాబ్ ముఖ్యమంత్రి అమరీందర్ సింగ్ శనివారం రాజీనామా చేశాక కొత్త సిఎల్‌పి నాయకుడు ఎవరన్నదానిపై ఇంకా ఏకాభిప్రాయం కుదరాల్సి ఉందని పార్టీ వర్గాలు వెల్లడించాయి. అయితే పంజాబ్ కాంగ్రెస్ మాజీ చీఫ్ సునీల్ జఖర్, ప్రస్తుత పార్టీ రాష్ట్ర అధ్యక్షుడు నవజోత్ సింగ్ సిధు, తృప్త్ రాజీందర్ సింగ్ బాజ్వా, సుఖ్‌జీందర్ సింగ్ రంధావాల పేర్లు  చక్కర్లు కొడుతున్నాయి. “ఏది ఎలా ఉన్నప్పటికీ మేము మాత్రం పార్టీ నాయకత్వం నిర్ణయానికి కట్టుబడి ఉంటాము” అని పార్టీ నాయకుడొకరు చెప్పారు.
ఎఐసిసి ప్రధాన కార్యదర్శి, పంజాబ్ వ్యవహారాల ఇన్‌ఛార్జీ హరీష్ రావత్, పార్టీ కేంద్రీయ పర్యవేక్షకులు అజయ్ మాకెన్, హరీష్ చౌదరిలు ప్రస్తుతం చంఢీగఢ్‌లో ఉన్నారు. కొత్త సిఎల్‌పి నాయకుడిని ఎంపిక చేసే బాధ్యతను పంజాబ్ కాంగ్రెస్ శాసనసభ్యులు పార్టీ అధ్యక్షురాలు సోనియా గాంధీకే అప్పగించారు. ఇదిలా ఉండగా రాజస్థాన్, ఛత్తీస్‌గఢ్‌లలో కాంగ్రెస్ ప్రభుత్వాలే ఉన్నప్పటికీ అక్కడ అసమ్మతి కొనసాగుతోందని కాంగ్రెస్ వర్గాలు తెలిపాయి. ఎన్నికలు జరుగనున్న నేపథ్యంలో జఖర్ వంటి ఓ హిందూ నాయకుడిని ఎంచుకునే అవకాశం ఉందని, అయితే ఆయన కనీసం ఎంఎల్‌ఏ కూడా కాకపోయినప్పటికీ కాంగ్రెస్ అధినాయకత్వానికి చాలా దగ్గరివాడని తెలుస్తున్నది.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News