Saturday, April 27, 2024

ఊరటనిచ్చే విజయమిది..

- Advertisement -
- Advertisement -

సింధు ఆత్మవిశ్వాసం రెట్టింపు

మన తెలంగాణ/హైదరాబాద్ : ప్రపంచ మహిళల బ్యాడ్మింటన్‌లో భారత స్టార్ షట్లర్ పి.వి.సింధు మళ్లీ ఆధిపత్యం చెలాయిస్తోంది. రెండు మూడేళ్లుగా వరు స ఓటములతో సతమతమవుతున్న సింధు ఈ ఏడాది మాత్రం మెరుగైన ప్రదర్శనతో ఆకట్టుకుంటోంది. గతంతో పోల్చితే సింధు ఆట ఇటీవల కాలంలో చాలా మెరుగైందనే చెప్పాలి. కొంతకాలం క్రితం సింధు ఆటను గమనిస్తే కెరీర్‌లో మరో టైటిల్ సాధిస్తుందా అనే సందేహం కలిగింది. చైనా, కొరియా, జపాన్, తైవాన్, ఇండోనేషియా, థాయిలాండ్ తదిత ర దేశాలకు చెందిన షట్లర్లు టైటిళ్ల మీద టైటిళ్లు సాధి స్తే సింధు మాత్రం కనీసం క్వార్టర్ ఫైనల్‌కు కూడా చేరకుండానే నిష్క్రమించింది. ఇలాంటి స్థితిలో సింధు పని అనిపోయిందని, ఆటకు రిటైర్మెంట్ ప్రకటించడమే మంచిదని కొందరు సూచనలు ఇచ్చారు. అయితే సింధు మాత్రం ఇలాంటి విమర్శలను పట్టించుకోకుండా ముందుకు వెళ్లింది. క్లిష్టమైన సమయంలోనూ ధైర్యాన్ని కోల్పోకుండా ఆడుతూ మళ్లీ పూర్వవైభవం సాధించేందుకు ప్రయత్నించింది.

దీని కోసం కఠోర సాధన చేసింది. ప్రతికూల పరిస్థితులు ఎదురైనా సింధు మాత్రం ఎక్కడ ఆత్మవిశ్వాసం కోల్పోలేదు. తన మార్క్ ఆటతో లక్షం దిశగా అడుగులు వేసింది. ఆడిన ప్రతి టోర్నమెంట్‌లోనూ మెరుగైన ఆటను కనబరిచింది. అయితే చాలా టోర్నీల్లో అదృష్టం కలిసి రాక నిష్క్రమించాల్సి వచ్చింది. కానీ మలేసియా మాస్టర్స్, సింగపూర్ ఓపెన్, ఇండోనేషియా ఓపెన్ తదితర టోర్నీల్లో మెరుగైన ఆటతో ఆకట్టుకుంది. అంతేగాక ర్యాంకింగ్స్‌లో తనకంటే మెరుగైన షట్లర్లు ఓడిస్తూ మళ్లీ గాడిలో పడింది. రానున్న కామన్వెల్త్, ఆసియా క్రీడలు, ఒలింపిక్స్ గేమ్స్ నేపథ్యంలో సింధు ఆట మెరుగు పడడం భారత్‌కు అతి పెద్ద ఊరటగా చెప్పొచ్చు. తాజాగా సింగపూర్ ఓపెన్ టైటిల్‌ను సింధు సొంతం చేసుకుంది.

ఈ టైటిల్ సింధు ఆత్మవిశ్వాసాన్ని రెట్టింపు చేసిందని చెప్పాలి. రానున్న టోర్నీల్లో మరింత మెరుగైన ప్రదర్శన చేసేందుకు ఈ విజయం దోహదం చేస్తుందనడంలో ఎలాంటి సందేహం. ఒకప్పుడూ ప్రపంచ బ్యాడ్మింటన్‌లో ఎదురులేని శక్తిగా కొనసాగిన తెలుగుతేజం సింధు మళ్లీ ఆ వైభవాన్ని అందుకోవాలని కోట్లాది మంది అభిమానులు కోరుకుంటున్నా రు. సింధు కూడా మెరుగైన ఆటను కనబరచడమే లక్షంగా అడుగులు వేస్తోంది. భవిష్యత్తులో మరిన్ని టైటిల్స్ ను సాధించడం ద్వారా రానున్న ఒలింపిక్స్ క్రీడలకు సమరోత్సాహంతో సిద్ధం కావాలని భావిస్తోంది.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News