Sunday, May 5, 2024

‘రాధేశ్యామ్’ ఫస్ట్ సాంగ్ వచ్చేస్తుంది..

- Advertisement -
- Advertisement -

హైదరాబాద్: యంగ్ రెబల్ స్టార్ ప్ర‌భాస్ నటించిన పాన్ ఇండియా ప్రాజెక్ట్‌ ‘రాధేశ్యామ్’. ఇప్పటికే విడుదల కావాల్సిన ఈ మూవీ వాయిదా పడుతూ వచ్చింది. చివరకు, వచ్చే ఏడాది సంక్రాంతి కానుకగా జనవరి 14న ప్రపంచవ్యాప్తంగా గ్రాండ్ గా రిలీజ్ కు సిద్ధమైంది. అయితే, ఈ సినిమా ఆప్డేట్స్ కోసం అభిమానులు ఎంతగానో ఎదురుచూస్తున్నారు. ఎట్టకేలకు అభిమానులకు గుడ్ న్యూస్ చెప్పింది చిత్రయూనిట్. తాజాగా ఈ మూవీ ఫస్ట్ సాంగ్ ను ఈ నెల 15న సాయంత్రం 5గంటలకు విడుదల చేయనున్నట్లు మూవీ మేకర్స్ వెల్లడించింది. కాగా, ఈ మూవీలో ప్రభాస్ సరసన పూజా హెగ్డే తొలిసారిగా నటిస్తోంది. మ్యూజికల్ లవ్ స్టోరిగా తెరెకెక్కిన ఈ సినిమాకు హిందీ వర్షన్ కు మిథూన్, మనన్ భరద్వాజ్ లు కలిసి సంగీతం అందిస్తుండగా, సౌత్ లాంగ్వేజెస్ లో జస్టిన్ ప్రభాకర్ సంగీతం సమకూర్చాడు.

‘Radhe Shyam’ first single released on Nov 15

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News