Wednesday, May 8, 2024

ఐపిఎల్‌లో రహానె ప్రకంపనలు

- Advertisement -
- Advertisement -

చెన్నై: ఈ ఐపిఎల్ సీజన్‌లో చెన్నై సూపర్ కింగ్స్ (సిఎస్‌కె) బ్యాటర్ అజింక్య రహానె పరుగుల వరద పారిస్తున్నాడు. టెస్టు ప్లేయర్‌గా ముద్ర పడిన రహానె ఈ ఐపిఎల్‌లో మాత్రం విధ్వంసక బ్యాటింగ్‌తో అలరిస్తున్నాడు. దూకుడైన బ్యాటింగ్‌తో చెన్నై విజయాల్లో తనవంతు పాత్ర పోషిస్తున్నాడు. అసలు ఏ మాత్రం అంచనాలు లేకుండా ఐపిఎల్ బరిలోకి దిగిన రహానె అసాధారణ బ్యాటింగ్‌తో అభిమానులను కనువిందు చేస్తున్నాడు.

ఇషాన్ కిషన్, రోహిత్, రాహుల్ త్రిపాఠి, దినేశ్ కార్తీక్, పూరన్, హెట్‌మెయిర్, సూర్యకుమార్ వంటి హార్డ్ హిట్టర్లకు సయితం సాధ్యం కానీ విధంగా రహానె దూకుడును ప్రదర్శిస్తున్నాడు. ఈ సీజన్‌లో రహానె ఏకంగా 199.04 స్ట్రైక్ రేట్‌తో పరుగులు సాధించడం విశేషం. ఆరంభ సీజన్ నుంచి ఐపిఎల్‌లో ఆడుతున్న రహానె స్ట్రైక్ రేట్ ఎప్పుడూ కూడా 120 మించలేదు. కానీ ఈసారి మాత్రం రహానె దాదాపు 200 స్ట్రైక్ రేట్‌తో పెను ప్రకంపనలు సృష్టిస్తున్నాడు. రహానె విధ్వంసక బ్యాటింగ్‌పై సోషల్ మీడియా వేదికగా ప్రశంసల వర్షం కురుస్తోంది.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News