Tuesday, April 30, 2024

బిజెపి హయాంలో న్యాయం కోరడం నేరం

- Advertisement -
- Advertisement -

‘డబుల్ ఇంజన్’ ప్రభుత్వాల కింద మరీ అన్యాయం
మహిళలపై నేరాల పెరుగుదలపై రాహుల్ విమర్శ

న్యూఢిల్లీ : ఇద్దరు బాలికలు ఉరి వేసుకుని ఆత్మహత్య చేసుకున్న సంఘటనలపై ఉత్తర ప్రదేశ్, మధ్య ప్రదేశ్ ప్రభుత్వాలను కాంగ్రెస్ అగ్ర నేత రాహుల్ గాంధీ గురువారం తూర్పారబట్టారు. ఆ రెండు రాష్ట్రాలలో న్యాయం కోరడం నేరం అవుతోందని రాహుల్ ఆరోపించారు. ఫిబ్రవరి 28న ఇద్దరు బాలికలు ఒక పొలంలో చెట్టుకు ఉరి వేసుకుని ఆత్మహత్య చేసుకున్నారు. వారిపై అత్యాచారం జరిగినట్లు ఆరోపణలు వచ్చిన కొన్ని రోజులకు వారి మృతదేహాలు ఒక చెట్టుకు వేలాడుతూ కనిపించాయి.

కాన్పూర్ ఘటంపూర్ ప్రాంతంలోని ఒక గ్రామంలో తాము పని చేస్తున్న ఒక ఇటుకల కొలిమి సమీపాన వారి శవాలు కనిపించాయి. ‘ఆ రెండు ఘటనల నుంచి నరేంద్ర మోడీ డబుల్ ఇంజన్ ప్రభుత్వాలలో ‘ద్వంద్వ అన్యాయం’ జరుగుతోందని అర్థం అవుతోంది. యుపిలో అత్యాచారానికి గురైన ఇద్దరు సోదరీమణులు ఉరి వేసుకున్నారు. ఇప్పుడు న్యాయం జరగనందున, కేసు ఉపసంహరణకు ఒత్తిడికి గురై వారి తండ్రి కూడా ఉరి వేసుకున్నాడు’ అని రాహుల్ ‘ఎక్స్’లో హిందీ పోస్ట్‌లో ఆరోపించారు. ‘ఎంపిలో ఒక మహిళకు మానభంగం జరిగింది. ఆమె నిరుపేద భర్త న్యాయం కోసం ప్రాథేయపడ్డాడు. కాని న్యాయం జరగనప్పుడు అతను తన ఇద్దరు పిల్లలతో కలసి ఉరి వేసుకున్నాడు’ అని ఆయన ఆరోపించారు.

‘డబుల్ ఇంజన్ ప్రభుత్వంలో న్యాయం కోరడం నేరం’ అని రాహుల్ అన్నారు. ‘బాధితులనే కాకుండా వారి కుటుంబాలను కూడా శత్రువులుగా పరిగణించడం బిజెపి పాలిత రాష్ట్రాలలో ఒక సంప్రదాయంగా మారింది’ అని ఆయన విమర్శించారు. ‘స్నేహపూర్వక మీడియా’ సృష్టించిన ‘బోగస్ ఖ్యాతి’ ఆ పార్టీకి ఉపయోగపడుతోందని ఆయన అన్నారు. మహిళలపై నేరాల సమస్యపై ఉత్తర ప్రవేశ్‌లోని బిజెపి ప్రభుత్వాన్ని కాంగ్రెస్ నాయకురాలు ప్రియాంక గాంధీ వాద్రా కూడా విమర్శలు గుప్పించారు. ‘మహిళ కావడం ఈ జంగిల్ రాజ్‌లో ఒక నేరంగా మారింది’ అని ప్రియాంక అన్నారు.

 

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News