Saturday, May 11, 2024

అందుబాటులోకి మరో 50 రైళ్లు

- Advertisement -
- Advertisement -

Railways is re-launching more than 50 trains

న్యూడిల్లీ : కరోనా మహమ్మారి కారణంగా భారీ ఎత్తున రైళ్లు ఆగిపోయిన సంగతి తెలిసిందే. ప్రస్తుతం కేసులు తగ్గుముఖం పడుతుండడంతో రైళ్లు మళ్లీ పట్టాలపై సాగడానికి సిద్ధమయ్యాయి. గరీబ్ధ్ రథ్, తాజ్ ఎక్స్‌ప్రెస్, షాన్‌ఎపంజాబ్, ముంబై సెంట్రల్ హజ్రత్ నిజాముద్దీన్, ఆగస్ట్ క్రాంతి రాజధాని, ఎక్స్‌ప్రెస్‌లతోపాటు 50 కి పైగా రైళ్లను రైల్వేశాఖ తిరిగి ప్రారంభిస్తోంది. ముంబై సెంట్రల్ నిజాముద్దీన్ ఆగస్టు క్రాంతి రాజధాని స్పెషల్ శనివారం నుంచి నడుస్తుండగా, షాజహాన్ పూర్ సీతాపూర్ సిటీ, సీతాపూర్ సిటీ షాజహాన్ పూర్ రిజర్వుడు, ఎక్స్‌ప్రెస్ స్పెషల్ ఆదివారం నుంచి అందుబాటు లోకి వస్తాయి. లక్నోవారణాసి, వారణాసి లక్నో ఇంటర్ సిటీ స్పెషల్ రైళ్లు సోమవారం నుంచి నడుస్తాయి. వారణాసిఆనందవిహార్ ఆనందవిహార్ వారణాసి, గరీబ్ రథ్ స్పెషల్స్, ఈనెల 8 నుంచి నడుస్తాయి. 5 నుంచి న్యూఢిల్లీ ఝాన్సీ తాజ్ ఎక్స్‌ప్రెస్ స్పెషల్స్ నడుస్తాయి.

 

 

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News