Tuesday, April 30, 2024

వాన నీటితో చెరువైన పాట్నా దవాఖానా..

- Advertisement -
- Advertisement -

పాట్నా: భారీ వర్షాలతో బీహార్ అతలాకుతలం అయింది. రాజధాని పాట్నాలో ఎడతెరిపిలేని భారీ వర్షాలతో జనం తల్లడిల్లుతున్నారు. పాట్నాలోని నలందా వైద్య కళాశాల అనుబంధ ఆసుపత్రిలోకి వరద నీరు వచ్చి చేరింది. దీనితో ఆసుపత్రి చెరువుగా మారింది. చికిత్సకు వచ్చిన రోగులు, బంధువులు నీళ్ల మధ్యనే కుర్చీలలో కూర్చుని గంటలకొద్ది తమ వంతు కోసం ఎదురుచూడాల్సి వస్తోంది.

పసిపిల్లలతో జ్వరంతో బాధపడుతున్న స్త్రీలు జడిపిస్తున్న వరద నీటి మధ్య నరకం అనుభవిస్తున్నారు. రోగం నయం అయ్యేందుకు ఆసుపత్రికి వస్తే బురదమయం అయిన వాననీటిలో గడిపి మరిన్ని జబ్బులు తెచ్చుకుంటామని పలువురు వాపోతున్నారు. పాట్నా ఇతర ప్రాంతాలలో మోకాళ్ల లోతు నీటితో జనం అడుగేయడానికి వణుకుతున్నారు.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News