Friday, July 12, 2024

శుక్రవారం ఉరుములతో కూడిన వర్షాలు

- Advertisement -
- Advertisement -

హైదరాబాద్: రాష్ట్రంలో పలు ప్రాంతాల్లో శుక్రవారం ఉరుములు మెరుపులతో కూడిన వర్షాలు కురిసే అవకాశం ఉన్నట్టు హైదరాబాద్ వాతావరణ కేంద్రం వెల్లడించింది. ఉపరితల ఆవర్తనం ఈశాన్య పరిసర ప్రాంతాలలోని తూర్పు మధ్య బంగాళాఖాతంలో సగటు సముద్ర మట్టానికి 5.8 కి.మి ఎత్తున కొనసాగుతూ ఎత్తుకు వెళ్లే కొలది నైరుతి దిశవైపునకు వంపుతిరిగివుంది. దిగువ స్థాయిలో గాలులు పశ్చిమ వాయువ్య దిశలనుండి తెలంగాణ రాష్ట్రంవైపునకు వీస్తున్నాయి. వీటి ప్రభావంతో రాష్ట్రంలో మరో 48గంటల పాటు అక్కడక్కడా తేలిక పాటినుంచి ఒక మోస్తరు వర్షాలు కురిసే అవకాశం ఉన్నట్టు వాతావరణ కేంద్రం వెల్లడించింది.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News