Thursday, May 9, 2024

నా త్యాగం వృథా కాలేదు: రాజగోపాల్ రెడ్డి

- Advertisement -
- Advertisement -

రాజీనామా చేసినప్పుడు నా త్యాగం వృథా కాలేదని మునుగోడు మాజీ ఎమ్మెల్యే కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి అన్నారు. బుధవారం బిజెపి పార్టీకి రాజగోపాల్ రెడ్డి రాజీనామా చేశారు. ఈ సందర్భంగా ఆయన మీడియా సమావేశం నిర్వహించారు. తన రాజీనామాతో మొత్తం ప్రభుత్వాన్ని మునుగోడుకు తీసుకువచ్చానన్నారు. తాను రాజీనామా చేశాకే.. మునుగోడు ప్రజల డిమాండ్లను ప్రభుత్వం నెరవేర్చిందని చెప్పారు. చండూరు రెవెన్యూ డివిజన్ అయ్యిందని… గట్టుప్పల్ మండలం అయ్యిందని.. చౌటుప్పల్ కు 100 పడకల ఆస్పత్రి వచ్చిందని.. గ్రామాల్లో సిసి రోడ్లు వేశారని ఆయన తెలిపారు.

కేంద్రంలో ఇప్పటికీ బిజెపి అధికారంలో ఉంది.. మరి తాను కాంగ్రెస్ లోకి వెళ్తున్నది ఎందుకు.. కాంట్రాక్టుల కోసమే తాను పార్టీ మారానని చెప్పిన వాళ్లు ఇప్పుడు సమాధానం చెప్పాలన్నారు. ఉప ఎన్నిక వస్తేనే.. మునుగోడుకు మంచి జరుగుతుందని అప్పుడు భావించానని.. మునుగోడు ఉపఎన్నికల్లో తాను నైతికంగా గెలిచానని రాజగోపాల్ రెడ్డి చెప్పారు.

ఎల్బీ నగర్ లో పోటీ చేయమని అక్కడి నేతలు అడిగారని.. తాను మాత్రం మళ్లీ మునుగోడు నియోజకవర్గం నుంచే పోటీ చేస్తానని తెలిపారు. తన సతీమణి రాజకీయాల్లోకి వస్తారని జరుగుతున్న ప్రచారం అవాస్తవమని చెప్పారు. తన ప్రాణమున్నంత వరకు తాను మునుగోడు నుంచే పోటీ చేస్తానని.. పార్టీ అవకాశం ఇస్తే.. కెసిఆర్ పై పోటీ చేసేందుకు సిద్ధంగా ఉన్నానని ఆయన పేర్కొన్నారు. ఒకటి రెండు రోజుల్లో రాజగోపాల్ రెడ్డి.. ఢిల్లీ వెళ్లి రాహుల్ గాంధీ సమక్షంలో తిరిగి కాంగ్రెస్ పార్టీలో చేరనున్నారు.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News