- Advertisement -
హైదరాబాద్: మంత్రి పదవి ఇస్తామన్న హామీని అధిష్టానం అమలు చేయలేదని మునుగోడు ఎమ్మెల్యే కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి (Komatireddy Rajagopal Reddy) తెలిపారు. మంత్రి పదవి హామీ వాస్తవమేనని తెలంగాణ డిప్యూటీ సిఎం భట్టి విక్రమార్క చెప్పారని అన్నారు. భట్టి విక్రమార్క వ్యాఖ్యలపై ఎమ్మెల్యే రాజగోపాల్ రెడ్డి స్పందించారు. రాష్ట్ర ముఖ్యనేతలు అడ్డుకుంటూ, అవమానిస్తున్నారన్న వాస్తవాన్ని మీడియా ద్వారా ప్రజలకు వివరించిన భట్టికి ధన్యవాదాలు తెలియజేశారు. తనకు మంత్రి పదవి ముఖ్యం కాదని, తెలంగాణ సమాజ ఆకాంక్షలు నెరవేర్చేలా పాలన ఉండాలని ఆశిస్తున్నాని అన్నారు. ప్రజలకు ఇచ్చిన హామీలను సర్కారు అమలు (Government promises) చేయాలని, అవినీతి రహిత పాలన అందించాలని కోరుతున్నానని రాజగోపాల్ రెడ్డి పేర్కొన్నారు.
- Advertisement -