Saturday, May 4, 2024

రాజంపేట తహసీల్దార్ సస్పెండ్

- Advertisement -
- Advertisement -

Rajampet tahsildar Motisingh‌ suspended

కామారెడ్డి: భూకబ్జాదారులకు అండగా నిలుస్తూ వారి నుండి అందినకాడికి దండుకుంటున్న రాజంపేట తహసీల్దార్ మోతిసింగ్‌పై సస్పెండ్ వేటు పడింది. . షేర్ శంకర్ తాండాలోని సర్వే నెంబర్ 278, 279 సర్వే నంబర్లు భూమిని భూకబ్జాదారులకు పట్టాలు చేసి ఇచ్చిన  కేసులో విచారణ జరిపిన అనంతరం రాజంపేట తహసీల్దార్ మోతిసింగ్‌ను జిల్లా కలెక్టర్ ఎ.శరత్ గురువారం సస్పెండ్ చేశారు. కామారెడ్డి జిల్లా రాజంపేట మండలం షేర్‌శంకర్ తాండాలో ప్రభుత్వ భూమి అన్యాక్రాంతం చేసి తనకు నచ్చిన వారికి పట్టా పాస్ పుస్తకాలు జారీ చేసినట్లు తహసీల్దార్ మోతిసింగ్‌పై ఆరోపణలు వినిపిస్తున్నాయి. అదేవిధంగా నచ్చిన వారికి పట్టాలు చేస్తూ నచ్చని వారికి ఇష్టారాజ్యంగా వారిపై దురుసుగా ప్రవర్తిస్తున్నారని గ్రామస్తులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. భూకబ్జాదారులకు తహశీల్దార్ వత్తాసు పలుకుతున్నారని వారు ఆరోపిస్తున్నారు.

వెంటనే ఆ పట్టాలను రద్దు చేయాలని డిమాండ్ చేస్తూ తండావాసులు కలెక్టర్ కార్యాలయానికి తరలివచ్చి కలెక్టర్‌ కార్యాలయంలో  ఫిర్యాదు చేశారు.  కలెక్టర్ అందుబాటులో లేకపోవడంతో స్థానిక సంస్థల అదనపు కలెక్టర్ వెంకటేష్ దోత్రేకు వినతిపత్రం అందజేశారు. తిరిగి మంగళవారం జిల్లా కలెక్టర్‌ను కలిసి వినతి పత్రాన్ని అందజేశారు. ప్రభుత్వం  రాష్ట్రంలో ఉన్న భూములను క్రమబద్దీకరించే యోచనలో ఉండి ధరణి వెబ్‌సైట్ ప్రారంభించి అవకతవకలు జరగకుండా సబ్ రిజిస్ట్రార్ అధికారులను నియమించిందని, న్యాయపరంగా ప్రతి రైతు భూమిని సంబంధిత హక్కుదారుడే అనుభవించాలనే ఉద్దేశంతో ప్రభుత్వం ప్రత్యేక కార్యాచరణను రూపొందిస్తుంటే, ప్రభుత్వ ఆశయానికి తూట్లు పొడస్తున్న తహసీల్దార్ మోతిసింగ్‌ సస్పెండ్ వేటు వేయడం ఇప్పడు మండలంలో చర్చనీయాంశమైంది.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News