Sunday, April 28, 2024

రాజస్థాన్ హైకోర్టు న్యాయమూర్తులుగా భార్యాభర్తలు

- Advertisement -
- Advertisement -

జైపూర్: రాజస్థాన్ హైకోర్టులో మొట్టమొదటిసారి ఒక భార్యాభర్తల జంట న్యాయమూర్తులుగా కొనసాగనున్నది. జస్టిస్ శుభా మెహతా, జస్టిస్ కుల్దీప్ మెహతాలను రాజస్థాన్ హైకోర్టు న్యాయమూర్తులుగా కేంద్ర న్యాయ శాఖ ఈనెల 3వ తేదీన నియమించింది. శుభా మెహతా భర్త మహేంద్ర గోయల్ ఇదివరకే రాజస్థాన్ హైకోర్టు న్యాయమూర్తిగా కొనసాగతుండగా ఇప్పుడు భార్యాభర్తలిద్దరూ ఒకే హైకోర్టులో న్యాయమూర్తులుగా బాధ్యతలు నిర్వర్తించనున్నారు. శుభా మెహతా జుడిషియల్ సర్వీసు నుంచి నియమితులు కాగా కుల్దీప్ మాథుర్ న్యాయవాదిగా ఉన్నారు. జస్టిస్ మహేంద్ర గోయల్ 2019 నవంబర్‌లో రాజస్థాన్ హైకోర్టులో న్యాయమూర్తిగా నియమితులయ్యారు. తాజాగా జరిగిన రెండు నియామకాలతో రాజస్థాన్ హైకోర్టులో న్యాయమూర్తుల సంఖ్య 27కి పెరిగింది. ఇప్పటికీ 23 న్యాయమూర్తి పోస్టులు ఖాళీగా ఉన్నాయి.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News