Friday, May 10, 2024

అమెరికా సాయం కోరిన రాకేశ్ టికైత్

- Advertisement -
- Advertisement -

Rakesh Tiakait

న్యూఢిల్లీ: దేశంలో కొత్త సేద్యపు చట్టాలకు వ్యతిరేకంగా రైతు ఉద్యమాన్ని నడుపుతున్న రాకేశ్ టికైత్ శుక్రవారం అమెరికా అధ్యక్షుడు జో బైడెన్‌కు ట్వీట్ చేసి సాయం కోరారు. ఆయనను కలుగజేసుకుని కొత్త సేద్యపు చట్టాన్ని భారత్ రద్దుచేసేలా చూడాలన్నారు.
“మమ్మల్ని నల్ల సేద్యపు చట్టాల నుంచి కాపాడండి. మీరు ప్రధాని మోడీతో సమావేశమయేప్పుడు మా విషయంపై కూడా దృష్టిపెట్టండి” అని భారతీయ కిసాన్ యూనియన్ నాయకుడు టికైత్ ట్వీట్ చేశారు. హ్యాష్‌టాగ్ బైడెన్ స్పీకప్‌ఫర్ ఫార్మర్స్‌తో ఆయన ఈ ట్వీట్‌చేశారు. ఇది ఇప్పుడు భారత్‌లో బాగా ట్రెండింగ్‌లో ఉంది.
వేలాది మంది భారతీయ రైతులు 2020 సెప్టెంబర్‌లో ఆమోదించిన మూడు కొత్త సేద్యపు చట్టాలకు వ్యతిరేకంగా ఆందోళన చేస్తున్నారు. ఆ మూడు చట్టాలు రైతులు కార్పొరేట్‌ల దయాదాక్షిణ్యాలపై బతికేలా చేయనున్నాయని వారు ఆందోళన వ్యక్తంచేస్తున్నారు. సంవత్సర కాలంగా రైతుల చేస్తున్న ఆందోళన ఇపుడు బిజెపి ఆర్థిక విధానాలకు వ్యతిరేక ఉద్యమంగా రూపాంతరం చెందింది. రైతు ఉద్యమంలో ప్రాతినిధ్యం వహిస్తున్న మహిళా ప్రతినిధి కురుగంటి “ఐక్యరాజ్యసమితి రైతు హక్కుల ప్రకటనలో భారత్ సంతకం చేసినందున ఐక్యరాజ్యసమితి ప్రత్యేక పాత్ర పోషించాల్సి ఉంది” అన్నారు.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News