Sunday, April 28, 2024

మూడు భాషల్లో బిగ్ సినిమా

- Advertisement -
- Advertisement -

Ram Charan and Shankar Film Update

ఇటీవల సౌత్ ఇండియన్ సినిమా నుండి ప్రకటించిన పలు భారీ ప్రాజెక్ట్‌లలో పాన్ ఇండియన్ దర్శకుడు శంకర్, మెగాపవర్ స్టార్ రామ్‌చరణ్‌ల కాంబోలో వస్తున్న భారీ సినిమా కూడా ఒకటి. ఈ మూవీ సెప్టెంబర్ నుంచి ప్రారంభం కావడానికి సన్నద్ధమవుతోంది. అయితే రోజులు గడుస్తున్న కొద్దీ ఈ భారీ ప్రాజెక్ట్ నుంచి పలు ఆసక్తికర విషయాలను అధికారికంగా మేకర్స్ వెల్లడిస్తున్నారు. అయితే ఈ సినిమా మూడు భాషల్లో తెరకెక్కనుందట. అంటే తెలుగు, తమిళ్, హిందీ భాషల్లో ఏకకాలంలో ఈ చిత్రం తెరకెక్కనున్నట్టు సమాచారం. మరి దీనిపై అధికారిక క్లారిటీ రావాల్సి ఉంది. ఇప్పటికే స్టార్ మ్యూజిక్ డైరెక్టర్ తమన్ ఈ చిత్రంలో రామ్ చరణ్ ఇంట్రడక్షన్ సాంగ్ రికార్డింగ్ పనిని ప్రారంభించాడు. ఈ భారీ బడ్జెట్ మూవీని దిల్‌రాజు, శిరీష్‌లు శ్రీ వెంకటేశ్వర క్రియేషన్స్ బ్యానర్‌లో 50వ చిత్రంగా నిర్మిస్తున్నారు.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News