Friday, April 26, 2024

చరణ్‌కు కరోనా నెగిటివ్

- Advertisement -
- Advertisement -

Ram Charan Tests Negative For Coronavirus

రామ్‌చరణ్ కరోనాను జయించాడు. తాజాగా ఆయనకు చేసిన కోవిడ్ నిర్ధారణ పరీక్షల్లో నెగిటివ్ రిపోర్ట్ వచ్చాయి. ఈ విషయాన్ని ట్విట్టర్ ద్వారా షేర్ చేసుకున్న చరణ్… పరీక్షల్లో తనకు కరోనా నెగటివ్ వచ్చిందని, త్వరలోనే షూటింగ్‌లో పాల్గొంటానని తెలిపాడు. అలాగే తన ఆరోగ్యం కోసం ప్రార్థించిన అందరికీ కృతజ్ఞతలు చెప్పాడు. ఇదిలావుండగా మెగాస్టార్ చిరంజీవి నటిస్తున్న లేటెస్ట్ మూవీ ‘ఆచార్య’లో రామ్‌చరణ్ కీలక పాత్ర చేయనున్న సంగతి తెలిసిందే. ఇప్పుడు జనవరి చివరి వారం లేదా ఫిబ్రవరి మొదటి వారంలో చరణ్,- చిరంజీవి మీద సీన్స్ తీస్తారని అంటున్నారు. దీని తర్వాత చరణ్ ‘ఆర్.ఆర్.ఆర్’లో మిగిలిన షూట్‌ని పూర్తి చేస్తాడని తెలిసింది.

Ram Charan Tests Negative For Coronavirus

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News