Tuesday, May 7, 2024

దట్టమైన అడవుల్లో యాక్షన్ సీన్స్

- Advertisement -
- Advertisement -

Ramarao on duty movie final schedule will start

 

మాస్ మహారాజా రవితేజ హీరోగా రూపొందుతున్న చిత్రం ‘రామారావు ఆన్ డ్యూటీ’. ఈ సినిమాతో శరత్ మాండవ దర్శకుడిగా పరిచయం కాబోతోన్నారు. ఎస్‌ఎల్‌వి సినిమాస్ ఎల్‌ఎల్‌పి బ్యానర్ మీద సుధాకర్ చెరుకూరి ఈ చిత్రాన్ని నిర్మిస్తున్నారు. ఇక చిత్రయూనిట్ ఫైనల్ షెడ్యూల్ ప్రారంభించేందుకు సిద్ధంగా ఉంది. ఈ ఫైనల్ షెడ్యూల్‌లో హై ఓల్టేజ్ యాక్షన్ సీన్స్‌ను తెరకెక్కించనున్నారు. భారతదేశంలోని దట్టమైన అడవుల్లో ఈ యాక్షన్ సీన్స్‌ను తెరకెక్కిస్తారు. యూరోప్‌లోని అందమైన లొకేషన్లలో పాటలను తెరకెక్కించనున్నారు. ఈ చిత్రం ఫస్ట్ లుక్ అందరినీ ఆకట్టుకుంది. రవితేజ ఫస్ట్ లుక్‌కు మంచి స్పందన వచ్చింది. యథార్థ సంఘటనల ఆధారంగా ఈ చిత్రం తెరకెక్కుతోంది. దివ్యాంక కౌశిక్, రజిషా విజయన్ హీరోయిన్లుగా నటిస్తున్న ఈ చిత్రంలో వేణు తొట్టెంపూడి ముఖ్యమైన పాత్రలో కనిపించబోతున్నారు.

 

 

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News