Sunday, April 28, 2024

క్వార్టర్ ఫైనల్లో భారత్

- Advertisement -
- Advertisement -

Indian women's team reaches quarterfinals of Uber Cup

 

ఆరూస్(డెన్మార్క్): ఇక్కడ జరుగుతున్న ప్రతిష్టాత్మకమైన ఉబేర్ కప్ బ్యాడ్మింటన్ టోర్నమెంట్‌లో భారత మహిళా జట్టు క్వార్టర్ ఫైనల్‌కు చేరుకుంది. గ్రూప్‌బిలో భాగంగా జరిగిన మ్యాచ్‌లో భారత్ 41 తేడాతో స్కాట్లాండ్‌ను చిత్తు చేసి క్వార్టర్ ఫైనల్ బెర్త్‌ను సొంతం చేసుకుంది. ఈ విజయంతో గ్రూప్‌లో భారత్ రెండో స్థానంలో నిలిచింది. అంతకుముందు స్పెయిన్‌తో జరిగిన మ్యాచ్‌లో కూడా భారత మహిళా టీమ్ విజయం సాధించిన విషయం తెలిసిందే. స్కాట్లాండ్‌తో జరిగిన తొలి సింగిల్స్‌లో భారత్‌కు ఓటమి ఎదురైంది. మాళవిక బన్‌సోద్ తొలి మ్యాచ్‌లో ఓటమి పాలైంది. క్రిస్టి గిల్‌మోర్‌తో జరిగిన పోరులో మాళవిక 1321, 921 తేడాతో పరాజయం పాలైంది. అయితే రెండో సింగిల్స్‌లో ఆదితి భట్ గెలిచి స్కోరును 11తో సమం చేసింది. రాచెల్ సుగ్డెన్‌తో జరిగిన పోరులో ఆదితి 2114, 218తో అలవోక విజయాన్ని అందుకుంది. ఆరంభం నుంచే దూకుడుగా ఆడిన ఆదితి ఏ దశలోనూ ప్రత్యర్థికి కోలుకునే అవకాశం ఇవ్వలేదు. వరుసగా రెండు సెట్లు గెలిచి మ్యాచ్‌ను సొంతం చేసుకుంది. తర్వాత జరిగిన డబుల్స్‌లో కూడా భారత జంట జయకేతనం ఎగుర వేసింది.

తనీషా క్రాస్టొరుతాపర్ణ పాండా జోడీ 2111, 218 తేడాతో స్కాట్లాండ్‌కు చెందిన జూలిసియారా జోడీని ఓడించింది. భారత జంట ఆరంభం నుంచే దూకుడైన ఆటను కనబరిచింది. ప్రత్యర్థి జోడీపై పూర్తి ఆధిపత్యం చెలాయిస్తూ అలవోక విజయాన్ని అందుకుంది. తర్వాత జరిగిన మూడో సింగిల్స్‌లోనూ భారత్ విజయం సాధించింది. భారత షట్లర్ తస్నిమ్ 2115, 216 తేడాతో స్కాట్లాండ్ క్రీడాకారిణి లౌరెన మిడెల్టన్‌ను చిత్తు చేసింది. అనంతరం జరిగిన రెండో డబుల్స్‌లో కూడా భారత్ విజయాన్ని అందుకుంది. త్రిసా జోలి, గాయత్రి గోపిచంద్ జంట 218, 1921, 2110 తేడాతో గిల్‌మోర్‌డానెల్ జంటను ఓడించింది. ఇక బుధవారం జరిగే లీగ్ మ్యాచ్‌లో థాయిలాండ్‌తో భారత్ తలపడుతుంది.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News