Tuesday, April 30, 2024

ఫలక్‌నుమా ప్యాలెస్‌లో రానా, మిహీకాల వివాహం..!

- Advertisement -
- Advertisement -

Rana and Miheeka Bajaj pre wedding photos viral

టాలీవుడ్ హీరో దగ్గుబాటి రానా ఎట్టకేలకు తన బ్యాచిలర్ లైఫ్ కి గుడ్‌బై చెప్పి ఓ ఇంటివాడు కాబోతున్న విషయం తెలిసిందే. హైదరాబాద్‌కి చెందిన బంటీ, సురేష్ బజాజ్ దంపతుల కుమార్తె అయిన మిహీకా బజాజ్‌ను ప్రేమించిన రానా సోషల్ మీడియా వేదికగా ఈ విషయాన్ని వెల్లడించాడు. వీరి పెళ్లికి ఇరు కుటుంబాలు కూడా ఓకే చెప్పేశారు. ఈ క్రమంలో ఇటీవల దగ్గుబాటి రానా, మిహీకా బజాజ్‌ల రెండు కుటుంబాల వారు కలిసి రోకా వేడుకను కూడా నిర్వహించారు. ఈ రోకా వేడుకలో రానా, మిహిక బజాజ్‌ల నిశ్చితార్థం.. వివాహం ఎప్పుడు, ఎక్కడ, ఎలా చేయాలనే దానిపై నిర్ణయం తీసుకున్నారు. ఆగస్ట్ 8న హైదరాబాద్‌లో రానా, మిహీకల పెళ్లి జరుగనుంది. పెళ్లి వాయిదా వేసుకున్నారని వచ్చిన వార్తలను ఖండించిన దగ్గుబాటి ఫ్యామిలీ ఆగస్ట్ 8న వివాహ వేడుక జరుగుతుందని స్పష్టం చేసింది.

కాగా రానా, మిహీకాల పెళ్లి ఏర్పాట్లు శరవేగంగా జరుగుతున్నాయట. తాజా సమాచారం ప్రకారం వీరి వివాహ వేడుక హైదరాబాద్‌లోని ప్రతిష్టాత్మకమైన తాజ్ ఫలక్ నుమా ప్యాలెస్‌లో వైభవంగా నిర్వహించబోతున్నారట. స్వయానా ఇంటీరియర్ డిజైనర్ అయిన మిహికా బజాజ్ ఇప్పటికీ పెద్ద పెద్ద వివాహ వేడుకలకు వెడ్డింగ్ ప్లానర్‌గా వ్యవహరించింది. దీంతో వీరి వెడ్డింగ్‌కి కూడా రాయల్ థీమ్‌తో సన్నాహాలను చేస్తోందట. తెలంగాణ ప్రభుత్వం సూచించిన గైడ్ లైన్స్‌ని అనుసరించి అవసరమైన అన్ని జాగ్రత్తలు తీసుకొని వివాహం జరిపించాలని కుటుంబ సభ్యులు ఏర్పాట్లు చేస్తున్నారట.

Rana and Miheeka’s wedding at Falaknuma Palace!

 

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News