Wednesday, May 8, 2024

మెగా హీరోకు జోడీగా…

- Advertisement -
- Advertisement -

టాలీవుడ్‌లో ప్రస్తుతం రష్మిక మందన్న టైమ్ నడుస్తోంది అనడంలో ఎలాంటి సందేహం లేదు. ఎందుకంటే ఈ ఏడాదిలో ఇతర హీరోయిన్స్ తో పోల్చితే రష్మిక గ్రాఫ్ చాలా పైకి వెళ్లింది. మహేష్ బాబు ‘సరిలేరు నీకెవ్వరు’, నితిన్ ‘భీష్మ’ సినిమాలతో ఈ భామ ఈ ఏడాది ప్రేక్షకుల ముందుకు వచ్చింది. ఆ రెండు సినిమాలు కూడా మంచి విజయాన్ని సాధించడంతో ఆమెకు మరింత క్రేజ్ పెరిగింది. ఇదే సమయంలో ’పుష్ప’ సినిమాలో రష్మిక నటిస్తోంది. ఇక తాజాగా మరో మెగా మూవీలో ఈ అమ్మడికి ఛాన్స్ దక్కినట్లుగా తెలిసింది. మెగా హీరో వరుణ్ తేజ్ ప్రస్తుతం బాక్సింగ్ నేపథ్యంలో ఒక సినిమాను చేస్తున్నాడు. కిరణ్ కొర్రపాటి దర్శకత్వంలో అల్లు బాబీ నిర్మించబోతున్న ఈ సినిమాలో రష్మిక మందన్నను తీసుకున్నారట. ‘బాక్సర్’ అనే వర్కింగ్ టైటిల్‌తో రూపొందుతున్న సినిమా షూటింగ్ ను పునః ప్రారంభించేందుకు ఏర్పాట్లు జరుగుతున్నాయి. త్వరలోనే యూనిట్ సభ్యులు హీరోయిన్ గురించి అధికారికంగా వెల్లడించే అవకాశం ఉంది.

Rashmika Mandanna to pair with Varun Tej?

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News