Wednesday, May 1, 2024

సిఎస్‌కెలో చేరిన జడేజా

- Advertisement -
- Advertisement -

Ravindra Jadeja joins CSK

 

ముంబై: స్టార్ ఆల్‌రౌండర్ రవీంద్ర జడేజా చెన్నై సూపర్ కింగ్స్ (సిఎస్‌కె)తో జత కలిశాడు. గాయం కారణంగా చాలా రోజులుగా క్రికెట్‌కు దూరంగా ఉన్న జడేజా ప్రస్తుతం పూర్తిగా కోలుకున్నాడు. ఇక శుక్రవారం అతను జట్టులో చేరాడు. ముంబైలో జరుగుతున్న సిఎస్‌కె శిక్షణ శిబిరంలో జడేజా పాల్గొననున్నాడు. ఆస్ట్రేలియా సిరీస్ సందర్భంగా జడేజా గాయం బారీన పడ్డాడు. ఆ తర్వాత అతనికి శస్త్ర చికిత్స కూడా జరిగింది. పూర్తిగా కోలుకున్న జడేజా బెంగళూరులోని జాతీయ క్రికెట్ అకాడమీలో సాధన చేశాడు. ప్రస్తుతం పూర్తి ఫిట్‌నెస్‌తో ఉన్న జడేజా ఐపిఎల్‌లో ఆడేందుకు ముంబై చేరుకున్నాడు. ఇప్పటికే చెన్నై జట్టు సభ్యులు తమ శిక్షణ శిబిరాన్ని ముంబైకి మార్చుకున్న విషయం తెలిసిందే. కెప్టెన్ మహేంద్ర సింగ్ ధోనీతో సహా చాలా మంది క్రికెటర్లు ఇప్పటికే ముంబై చేరారు. తాజాగా జడేజా కూడా జట్టులో చేరాడు. చెన్నై తన ఆరంభ ఐదు మ్యాచ్‌లను ముంబైలోనే ఆడనుంది. దీంతో ముంబైలోనే సాధన చేయాలని నిర్ణయించింది. ఇందులో భాగంగానే ఇక్కడికి చేరుకుంది.

 

 

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News