Monday, May 13, 2024

బ్యాంక్ లాకర్ కొత్త నియమాలేమిటి?

- Advertisement -
- Advertisement -

Rbi Issues New Guidelines For Bank Lockers

కొత్త నిబంధనలతో లాభమా? నష్టమా?
లాకర్ నష్టానికి 100 రెట్లు పరిహారం
ప్రకృతి వైపరీత్యాలకు బ్యాంక్ బాధ్యత వహించదంటున్న ఆర్‌బిఐ

చాలా బ్యాంకులు సురక్షితమైన డిపాజిట్ లాకర్లను అందిస్తున్నాయి. ఆర్‌బిఐ(భారతీయ రిజర్వు బ్యాంక్) తాజాగా బ్యాంక్ లాకర్లకు కొత్త నిబంధనలను తీసుకొచ్చింది. ఈ నిబంధనలతో లాభమా? నష్టమా? అంటే కొత్త మెరుగేనని నిపుణులు చెబుతున్నారు. నగలు లేదా ముఖ్యమైన పత్రాలను సురక్షితంగా ఉంచడానికి, కొత్తగా బ్యాంకు డిపాజిట్ లాకర్‌ను తీసుకోవాలనుకునే వారికి నిబంధనలు బాగున్నాయని చెప్పాలి. లాకర్‌లో ఉన్న మెటీరియల్‌కి ఏదైనా నష్టం జరిగితే ఎంత పరిహారం పొందవచ్చనే నిబంధనల్లో ఆర్‌బిఐ మార్పులు చేసింది. బ్యాంకు తప్పిదం వల్ల లాకర్‌లోని వస్తువులు పాడైతే కస్టమర్‌కు వార్షిక అద్దెకు 100 రెట్లు పరిహారం చెల్లించాల్సి ఉంటుందని రిజర్వు బ్యాంక్ తెలిపింది.

లాకర్ ఉన్న భవనం కూలిపోతే లేదా అగ్నిప్రమాదం జరిగితే, దొంగతనం, బ్యాంక్ ఉద్యోగి మోసం చేస్తే పరిహారం ఇవ్వాల్సి ఉంటుంది. సురక్షితమైన డిపాజిట్ లాకర్‌ను ఏర్పాటు చేయడం బ్యాంక్ బాధ్యత, కానీ లాకర్‌లో ఉంచిన వస్తువుల విషయంలో కస్టమర్ తప్పు ఉంటే, అప్పుడు దానికి బ్యాంక్ బాధ్యత వహించబోదు. ఇక ప్రకృతి వైపరీత్యాలు అంటే భూకంపం లేదా వరద లేదా తుఫాను లేదా పిడుగుల కారణంగా నష్టం వస్తే బ్యాంకులు పరిహారం చెల్లించాల్సిన అవసరం లేదని కూడా ఆర్‌బిఐ తెలిపింది. బ్యాంకు లాకర్ల కొత్త నియమాలు 20220 జనవరి 1 నుండి అమల్లోకి వర్తిస్తాయి. బ్యాంకులో మొదటిసారిగా కొత్త లాకర్ పొందాలనుకునే వారికి ఆర్‌బిఐ నిబంధనలు శుభవార్త అని చెప్పాలి. ఇకపై బ్యాంకులో లాకర్ కోసం దరఖాస్తు చేస్తే, ఆ శాఖలో లాకర్ ఖాళీగా లేకుంటే గానుక మీకు వెయిట్‌లిస్ట్ నంబర్ ఇవ్వాల్సి ఉంటుంది.

బ్యాంకులు ఇప్పుడు శాఖల వారీగా ఖాళీ లాకర్ల జాబితా, కోర్ బ్యాంకింగ్ వ్యవస్థలో వేచి ఉండే జాబితాను వెల్లడించాల్సి ఉంది. సురక్షిత డిపాజిట్ లాకర్ల కేటాయింపులో పారదర్శకత తీసుకురావాలనే లక్ష్యంతో రిజర్వ్ బ్యాంక్ ఈ ఏర్పాట్లను చేసింది. ఇప్పటికే లాకర్ తీసుకున్నట్లయితే టర్మ్ డిపాజిట్ చెల్లించాల్సిన అవసరం లేదు. ఖాతా పని చేసే స్థితిలో ఉంటే టర్మ్ డిపాజిట్ ఇవ్వమని బ్యాంక్ మిమ్మల్ని అడగబోదు. బ్యాంకులు లాకర్ కార్యకలాపాల గురించి కస్టమర్‌కు ఎస్‌ఎంఎస్ లేదా ఇమెయిల్ ద్వారా తెలియజేస్తాయి. ఒకవేళ బ్యాంక్ లాకర్‌ను మార్చవలసి వస్తే కస్టమర్‌కు సమాచారం ఇవ్వాలి. స్ట్రాంగ్ రూమ్, వాల్ట్‌లో ప్రవేశం, నిష్క్రమణ, సిసిటివి ఫుటేజీలను బ్యాంకులు కనీసం 180 రోజుల పాటు ఉంచాల్సిన అవసరం ఉంది.

లాకర్‌ను ఎలా పొందాలి?

బ్యాంకులో సురక్షితమైన డిపాజిట్ లాకర్ తీసుకోవాలనుకుంటే ముందుగా బ్యాంక్ నుండి దాని లభ్యతను తెలుసుకోవాలి. లాకర్ కలిగి ఉంటే బ్యాంకుతో లాకర్ అద్దె ఒప్పందం చేసుకోవాలి. ఇది బ్యాంక్ బాధ్యతలు, హక్కులను తెలియజేస్తుంది. లాకర్ కేటాయింపు సమయంలో బ్యాంకులు టర్మ్ డిపాజిట్ కోసం అడగవచ్చు, ఇది లాకర్ మూడేళ్ల అద్దె, ఇతర ఖర్చులను కవర్ చేస్తుంది. లాకర్ రెంట్ బ్యాంకు శాఖ స్థానం, లాకర్ పరిమాణంపై ఆధారపడి ఉంటాయి. లాకర్‌ను సింగిల్ లేదా జాయింట్‌గా తీసుకోవచ్చు, నామినీ ఉండాలి. జాయింట్‌లో ఒక లాకర్ హోల్డర్ మరణిస్తే నామినీ లేదా ఇతర హోల్డర్ దానికి యాక్సెస్ పొందే అవకాశం ఉంటుంది. నామినీ లేకపోతే చట్టపరమైన వారసుడు అవసరమైన పత్రాలను అందిస్తే లాకర్ హక్కులను పొందుతారు.
డిపాజిట్ లాకర్ వద్దనుకుంటే సరెండర్ అప్లికేషన్‌ను సమర్పించాలి. ఆ తర్వాత లాకర్‌ను ఖాళీ చేసి, దాని కీని బ్యాంకుకు తిరిగి ఇవ్వాలి. తీసుకున్న అద్దె మీకు తిరిగి ఇస్తారు.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News