Sunday, April 28, 2024

గోవాలో ఇద్దరు రష్యన్ మహిళల మృతదేహాలు లభ్యం

- Advertisement -
- Advertisement -

Two Russian women bodies found in Goa

పనాజీ: ఉత్తర గోవాలోని ఒక సముద్ర తీర గ్రామంలో రెండు వేర్వేరు సంఘటనల్లో ఇద్దరు రష్యా మహిళల మృతదేహాలు లభించాయి. సియోలిమ్ గ్రామంలో అద్దె ఇంట్లో నివసిస్తున్న అలెక్జాండ్ర జావి(24) అనే రష్యన్ మహిళ మృతదేహం సీలింగ్ ఫ్యానుకు ఉరివేసుకుని లభించింది. కాగా..అదే గ్రామంలో ఒక అపార్ట్‌మెంట్‌లో నివసిస్తున్న ఏకాతెరినా తితోవా(34) అనే మరో రష్యన్ మహిళ మృతదేహం లభించిందని సీనియర్ పోలీసు అధికారి ఒకరు తెలిపారు. వారి మృతదేహాలపై గాయాలకు సంబంధించిన ఎటువంటి ఆనవాళ్లు లేవని, ఈ కేసులను అన్ని కోణాలలో దర్యాప్తు చేస్తున్నామని ఆయన చెప్పారు. ఈ ఇద్దరు మహిళలకు పరస్పర పరిచయం కూడా లేదని ప్రాథమిక దర్యాప్తులో వెల్లడైందని ఆయన చెప్పారు.

Two Russian women bodies found in Goa

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News