Saturday, April 27, 2024

ఆత్మీయ బంధానికి ప్రతీక.. రక్షా బంధన్

- Advertisement -
- Advertisement -

Raksha bandhan festival in telugu

హైదరాబాద్: అక్కా తమ్ముళ్ళు, అన్నా చెల్లెల్లా ప్రేమానురాగాలు, ఆత్మీయ బంధానికి రాఖీ పండుగప్రతీక. అక్కా చెల్లెళ్ళ తమ అనురాగ ఆప్యాయతలను దారాలుగా పెనవేసి, రాకీగా మలిచి శ్రావణ పౌర్ణమి రోజున అన్నాదమ్ముల చేతి కట్టే మహోత్తరమైన పండుగ రక్షా బంధన్. మానవీయ సంబంధాలను మరింత పెంచే సోదర ప్రేమకు ప్రతిరూపంగా నిలి చే రక్షా బంధన్ పండుగ ఆదివారం జరగునుంది. నాటి నుంచి నేటి హైటెక్ యుగంలోను కేవలం అన్నా చెల్లెళ్లు, అక్కా తమ్ముళ్లకే పరిమితం కాకుండా కుల మతాలకు అతీతంగా సోదరులుగా భావించే ప్రతి ఒక్కరి చేతికి ఆడపడుచు రాఖీని కట్టి ఈ పర్వదినాన్ని ఘనంగా జరుపుకోనున్నారు. తన సోదరులు నిండు నూరేళ్లు సుఖ సంతోషాలతో జీవించాలని ఆకాంక్షిస్తూ అక్కా చెల్లెలు రాఖీ అనే రక్షణ కవచాన్ని కట్టనుండగా తన అక్కా చెల్లెలు మెట్టినింట్లో జీవితాంతం అష్టాఐశ్వార్యాలతో సుఖంగా జీవించాలంటూ అన్నా దమ్ములు దీవించనున్నారు.

ఈ ఏడాది పెద్ద ఎత్తున అమ్మకాలు…

గతంలో చిన్న దూదితో ముడివేసిన దారాలను రక్షా బంధాలను కట్టెవారు.అయితే కాలం గడుస్తున్న కొద్ది రాఖీల సైతం రూపాంతరం చెందుతూ విభిన్న రూపాల్లో అందుబాటులోకి వచ్చాయి. కరోనా కారణంగా గత ఏడాది రాఖీ పండుగ సాధా సీదాగా జరుపుకోగా ఈ ఏడాది మాత్రం మార్కెట్లని ఆడపడుచులతో కిటకిటలాడుతున్నాయి. అదేవిధంగా మార్కెట్లలో సైతం విభిన్న డిజైన్లలో ఇట్టే ఆఆకర్షించే విధంగా రంగురంగుల రాఖీలు కన్నువిందు చేస్తున్నాయి. ప్రస్తుతం మార్కెట్‌లో సాధారణ రాఖీలు రూ. 5లు మొదల్కొన్ని రూ.200 లోపు ధరల్లో అందుబాటులో ఉండగా రాళ్లు, ముత్యాలు పొందింగిన రాఖీలు రూ.200 నుంచి రూ, 1000పైగా ధరలున్నాయి. పేద,మధ్యతరగతి కుటుంబాలకు చెందిన ఆడపడుచులు తమ తమ తహాత్తుకు తగ్గ రాఖీలు కడుతూ తమతమ ప్రేమానురాగాలను చాటుకుంటుండగా , సంపన్న కుటుంబాలకు చెందిన అడపడుచులు తమ అన్నదమ్ములకు వెండి, బంగారుతో చేయించిన రాఖీలను కడుతుంటారు.

స్వీట్లకు భలే గిరాకీ…

రాఖీ పౌర్ణమి పురస్కరించుకుని నగరంలో స్వీట్లకు భలే గిరాకీ ఏర్పడింది. రాఖీలు, స్వీట్ల కొనుగోళ్లతో గత మూడు రోజులుగా నగరంలో పూర్తి సందడి నెలకొంది. ఆదివారమే రాఖీ పండుగ కావడంతో శనివారం నగరంలోని అన్ని ప్రధాన మార్కెట్లలో ఏర్పాటు చేసిన రాఖీల దుకాణాలు మిఠాయి దుకాణాలు ఆడపడుచులతో మరింత కిటకిటలాడుతున్నాయి.దీంతో నగరంలోని స్వీట్స్ షాపులు దాదాపుగా శనివారానికే ఖాళీఅయ్యాయి. గడచిన వారం రోజుల నుంచే అన్ని మిఠాయిదుకాణదార్లు విభిన్న రకాల స్వీట్లను తయారు చేసి వినియోగదారులను ఆకట్టుకునే పనిలో పడ్డారు. కరోనా కారణంగా గత ఏడాది రాఖీ పండుగను సందర్భంగా చాలమంది ఆడపడుచులు పోస్టల్, కొరియర్‌లతో పాటు ఆన్‌లైన్‌లో రాఖీలు కొనుగోలు చేసి నేరుగా వారి పుట్టింటికే పంపించారు. అయితే ఈ ఏడాది ప్రస్తుతం కరోనా ప్రభావం అంతగా లేకపోవడంతో పెద్ద ఎత్తున మార్కెట్లు కిక్కిరిసి పోయ్యాయి. దీంతో సాధారణ రోజులతో పోల్చితే స్వీట్ల ధరలు అమాంతం పెరిగాయి.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News