Tuesday, April 30, 2024

నేటి నుంచి సాగు భూముల రిజిస్ట్రేషన్ షురూ

- Advertisement -
- Advertisement -

Registration of Agricultural lands through Dharani portal from today

 

ఉదయం 10.30 గంటల నుంచి మధ్యాహ్నం 3.30 వరకు స్లాట్ బుకింగ్‌లకు అవకాశం
రిజిస్ట్రేషన్‌లకు 570 తహసీల్దార్ కార్యాలయాలు సిద్ధం
ఆధార్ వివరాలు లేక నిలిచిపోయిన 3.9 లక్షల ఖాతాలు
నివేదిక తయారు చేసి ప్రభుత్వానికి సమర్పించిన సిసిఎల్‌ఏ
సమగ్ర సర్వే తరువాత ధరణి పోర్టల్‌లో ఈ భూముల నమోదు

మన తెలంగాణ/హైదరాబాద్ : నేటి నుంచి ధరణి పోర్టల్ ద్వారా వ్యవసాయల భూములను రిజిస్ట్రేషన్ చేయనున్నారు. రిజిస్ట్రేషన్‌లతో పాటు మ్యుటేషన్‌లు ప్రజలకు అందనున్నాయి. మీ సేవ లేదా ఆన్‌లైన్ ద్వారా స్లాట్‌లను బుక్ చేసుకునేలా, ఒక్కో తహసీల్దార్ కార్యాలయంలో రోజుకు 10 స్లాట్‌లను నమోదు చేసుకునేలా ప్రభుత్వం అనుమతి ఇచ్చింది. ఈ రిజిస్ట్రేషన్‌లు ఉదయం 10.30 గంటల నుంచి మధ్యాహ్నం 3.30 గంటల వరకు ఈ స్లాట్ బుకింగ్ చేసుకునే అవకాశాన్ని ప్రభుత్వం కల్పించింది. మొత్తం 570 తహసీల్దార్ కార్యాలయాల్లో ఈ సేవలు ప్రారంభం కానుండగా, 15 నుంచి 20 నిమిషాల్లో ఈ రిజిస్ట్రేషన్‌ల ప్రక్రియ పూర్తి కానుండగా వారం రోజుల్లో ఇంటికే పాసు పుస్తకం వచ్చేలా ప్రభుత్వం ఏర్పాట్లు చేసింది. అయితే మ్యుటేషన్‌కు సంబంధించి (ఎకరాకు) రూ.2,500ల లను చెల్లించాల్సి ఉంటుంది. క్రయ, విక్రయాలు, బహుమతి, తాకట్టు, భూహక్కుల బదిలీ, వారసత్వ పంపిణీ తదితర లావాదేవీలకు సంబంధించి మ్యుటేషన్ చార్జీలను వసూలు చేయనున్నారు.

రిజిస్ట్రేషన్‌తో పాటు ఏ సేవ పొందాలన్నా స్లాట్ బుకింగ్ చేసుకోవాల్సిందే. ఆన్‌లైన్ లేదా మీ సేవ ద్వారా మ్యుటేషన్‌కు దరఖాస్తు చేసుకోవాలంటే రూ.145 ఫీజును, ధరణి సేవలను పొందేందుకు నిర్వహణ చార్జీల కింద రూ.425లను కొత్తగా భూమి కొన్న యజమానికి పాసు పుస్తకం జారీ చేయడానికి రూ.300 ఫీజును చెల్లించాల్సి ఉంటుంది. గతంలో పాసు పుస్తకం ఉన్న వారికి దాని రెండో పేజీలో విస్తీర్ణం, సర్వే నెంబర్లను ప్రచురించి ఇస్తారు. పాసు పుస్తకంతో పాటు ఇతరత్రా పత్రాలను కొరియర్ ద్వారా పంపించేందుకు రూ.200లను చెల్లించాల్సి ఉంటుంది. అయితే ఇదిలా ఉండగా ఇప్పటివరకు వివాదాస్పదం లేని కోటి 45 లక్షల 58 వేల ఎకరాల భూముల వివరాలను ఈ ధరణి పోర్టల్‌లో పొందుపరిచారు.

డిజిటల్ సంతకాలు కానివి 9.67 లక్షల ఖాతాలు

ఇంకా రికార్డుల ప్రక్షాళనలో డిజిటల్ సంతకాలు కానీ 9.67 లక్షల ఖాతాలున్నాయి. వీటితో పాటు సివిల్ కేసుల్లో ఉన్న భూములు 40 వేల ఎకరాలకు పైన ఉండగా, ఆధార్‌కార్డు లేని భూములకు సంబంధించి 4.5 లక్షల ఎకరాలకు భూములకు సంబంధించిన పాసు పుస్తకాలు పెండింగ్‌లో ఉన్నాయి. వీటిని కూడా ధరణిలో పొందుపరచడానికి సంవత్సరం కాలం పట్టే అవకాశం ఉందని అధికారులు పేర్కొంటున్నారు. భూ రికార్డుల ప్రక్షాళన ప్రారంభమై మూడేళ్లు పూర్తయినా సుమారు 15 లక్షల ఎకరాలకు సంబంధించి భూముల యాజమాన్య హక్కులపై ఇంకా అనిశ్చితి కొనసాగుతూనే ఉంది. భూ వివాదాలు, సాంకేతిక కారణాలు, సివిల్ కేసులు, ప్రభుత్వ, ప్రైవేటు వ్యక్తుల మధ్య సరిహద్దు తగాదాలు, వ్యవసాయేతర అవసరాలకు మళ్లీంచిన భూములు ఇలా రాష్ట్ర వ్యాప్తంగా 15,69,209 ఎకరాల భూములు పలు కారణాలతో ధరణి పోర్టల్‌లో ఎక్కించడానికి అవకాశం లభించలేదు. దీనికి సంబంధించిన ఓ నివేదికను సిసిఎల్‌ఏ తయారు చేసి ప్రభుత్వానికి సమర్పించింది.

ఇంకా గ్రహణం వీడని 4.5 లక్షల ఎకరాలు

మరోవైపు ఆధార్ వివరాలు సరిగ్గా లేకపోవడంతో ఏకంగా 3.9 లక్షల ఖాతాల డిజిటల్ సంతకాల ప్రక్రియ నిలిచిపోయింది. ఇలా 4.5 లక్షల ఎకరాల భూ విస్తీర్ణానికి ఇంకా గ్రహణం వీడలేదు. వారసత్వ పంచాయతీలతో 38,504 ఖాతాలు, 33,682 ఎకరాల మేర పెండింగ్‌లో పడింది. అలాగే పిఓటి కేటగిరిలో 64,722 ఖాతాలు కాగా, 82,439 ఎకరాల యాజమాన్యాలపై మెలిక పడింది. విస్తీర్ణంలో వ్యత్యాసాలున్న కేటగిరీలో 43,475 ఖాతాలకు సంబంధించి 65,316 ఎకరాలకు పాసు పుస్తకాలు పెండింగ్‌లో ఉంచారు. ఇవేకాకుండా ప్రభుత్వ, ప్రైవేటు వ్యక్తుల మధ్య సరిహద్దు వివాదాలతో వేలాది ఎకరాలకు సంబంధించిన భూ హక్కులపై ఎటువంటి నిర్ణయం తీసుకోలేదు. అయితే వీటిన్నింటికి సమగ్ర భూ సర్వే తరువాతే ధరణిలో చోటు దక్కే అవకాశ ఉంటుందని రెవెన్యూ వర్గాలు పేర్కొంటున్నాయి.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News