Saturday, May 4, 2024

పల్లెటూరి పడుచుగా…

- Advertisement -
- Advertisement -

Rashi Khanna looks beautiful in Saree

అల్ట్రా గ్లామరస్‌గా కనిపించే రాశిఖన్నా ఇటీవల పక్కా పల్లెటూరి పిల్లలా కనిపించి మైమరపించింది. పల్లెటూరి భామగా లంగావోణీ కట్టుకొని ఈ బ్యూటీ దిగిన కొన్ని ఫొటోలు సోషల్ మీడియాలో సందడి చేశాయి. ఈ ఫొటోలను చూసి రాశిలో ఈ యాంగిల్ కూడా ఉందా అని ఆశ్చర్యపోవడం నెటిజన్ల వంతయింది. ఇప్పుడు చీర కట్టుకొని పల్లెటూరు పడుచు అవతారంలో మరో యాంగిల్ చూపిస్తోంది ఈ భామ. ప్రస్తుతం ఈ ఫొటోలు సోషల్ మీడియాలో జోరుగా వైరల్ అవుతున్నాయి.

గత కొంత కాలంగా రాశి ఖన్నా చేసిన ఫొటోషూట్లు యమ హాట్‌గా ఉన్నాయి. గతంలో పక్కా అల్ట్రా మోడ్రన్ డ్రెస్సుల్లో ఎక్స్‌పోజింగ్ చేస్తూ రాశి ఇచ్చిన స్టిల్స్ వైరల్ అయ్యాయి. అలాంటి అమ్మాయి ఇలా అకస్మాత్తుగా అందమైన పల్లెటూరి పడుచులా మారిపోయేసరికి అంతా ఆశ్చర్యపోతున్నారు. ఈ ఫొటోలతో తనని ఒకే తీరుగా చూడొద్దని…తనలో చాలా యాంగిల్స్ ఉన్నాయని అంటోంది ఈ బ్యూటీ. అన్నిరకాల పాత్రలకు తాను సరిపోతానని చెబుతోంది రాశిఖన్నా.

https://twitter.com/RaashiKhanna/status/1322809650740428802?ref_src=twsrc%5Etfw%7Ctwcamp%5Etweetembed%7Ctwterm%5E1322809650740428802%7Ctwgr%5Eshare_3&ref_url=https%3A%2F%2Fwww.ntnews.com%2Fadd-news

Rashi Khanna looks beautiful in Saree

 

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News