Sunday, April 28, 2024

నిబంధనలు సడలింపు

- Advertisement -
- Advertisement -

 ఐటి, హెల్త్ ఉద్యోగులకు హెచ్1బి వీసాల్లో ఊరట
 జీవిత భాగస్వాములు, పిల్లలకు వర్తింపు

Relaxation in H1B visas for IT and health employees

వాషింగ్టన్: అమెరికాలో హెచ్ 1 బి, ఎల్ 1 ట్రావెల్ వీసాల నిబంధనలలో స్వల్ప సడలింపులు కల్పించారు ఇంతకు ముందు విధించిన అమెరికా ప్రవేశ నిషేధ విషయంలో కొన్ని మినహాంపులు ఇచ్చారు. ఈ మేరకు తాజాగా అధికారిక ఉత్తర్వులు వెలువడ్డాయి. ఇప్పటివరకూ ఈ వీసాల విషయంలో కరకుగా వ్యవహరిస్తూ వస్తున్న దేశాధ్యక్షులు డొనాల్డ్ ట్రంప్ అనూహ్యంగా వీటిని సడలించారు. దీనితో ఈ హెచ్ 1 బి వీసాల నిబంధనలపై ఆయన కొద్దిగా మెత్తబడినట్లు స్పష్టం అయింది. ఈ ఇప్పటి సడలింపుల ప్రక్రియలతో వీసా నిషేధం కంటే ముందు చేసిన ఉద్యోగాలలోకి తిరిగి వచ్చే వీసాదారులకు అమెరికాలో ప్రవేశించేందుకు అనుమతి కల్పిస్తారు.

ట్రంప్ అధికార యంత్రాంగం వెలువవరించిన సడలింపులతో భారతీయ ఐటి వృత్తినిపుణులకు, ఆరోగ్యపరిరక్షణ విభాగాలలో పనిచేసే వారికి తిరిగి అమెరికాలో ఉద్యోగాలకు వీలేర్పడుతుంది. వీసాదారులతో పాటు వారిపై ఆధారపడిన జీవిత భాగస్వామ్యులు, పిల్లలు కూడా వెంట రావచ్చునని, ఇందుక అనుమతి కల్పిస్తున్నామని అమెరికా డిపార్ట్‌మెంట్ ఆఫ్ స్టేట్ అడ్వైజరీ తెలిపింది. ఇక హెచ్ 1 బి వీసాదార్లు అయిన సాంకేతిక నిపుణులు, ఉన్నత స్థాయి మేనేజర్లు ఇతర విభాగాలలో విధులలో ఉన్న వారికి అమెరికా ప్రవేశానికి అనుమతి ఉంటుంది.

 

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News