Monday, May 6, 2024

రూ.2800కే రెమ్‌డెసివిర్

- Advertisement -
- Advertisement -

 తక్కువ ధరలో అందుబాటులోకి జైడస్ క్యాడిలా ఔషధం
 సరైన సరఫరా వ్యవస్థ ద్వారా అందిస్తామని ప్రకటన

Remdesivir drug price rs 2800

న్యూఢిల్లీ: మరింత తక్కువ ధరకు జైడన్ క్యాడిలా సంస్థ రెమిడెసివిర్ మందును అందుబాటులోకి తేనుంది. దీనిని జెనెరిక్ వర్షన్‌గా పేర్కొన్నారు. కరోనా వైరస్ చికిత్సకు రెమ్‌డాక్ ఇప్పటికే మార్కెట్‌లో ఉంది. ఇది ప్రభుత్వ, ప్రైవేటు వైద్యశాలల్లో దొరుకుతుందని జైడన్ ఔషధ సంస్థ తెలిపింది. దీని ధర ఇప్పుడు 100 ఎంజి పరిణామపు ఒక వయల్ ధర రూ 2800 గా ఖరారు చేసినట్లు సంస్థ నిర్వాహకులు గురువారం తెలిపారు. ఇప్పటివరకూ వివిధ ఔషధ కంపెనీలు విడుదల చేసిన మందులతో పోలిస్తే ఇది తక్కువ అని జైడన్ తెలిపింది. కొన్ని రాష్ట్రాలలో కరోనా ఔషధ సరఫరాలో పలు సమస్యలు ఎదురవుతున్నాయి. పలు చోట్ల కొరత నెలకొంది. దీనిని దృష్టిలో పెట్టుకుని తాము ఎటువంటి లోపాలు తలెత్తకుండా దేశవ్యాప్తంగా రెమిడెసివిర్‌ను తక్కువ ధరకు, సరైన సరఫరా వ్యవస్థ ద్వారా అందిస్తామని సంస్థ డైరెక్టర్ డాక్టర్ షర్విల్ పటేల్ తెలిపారు. ఇప్పటివరకూ ఈ రెమిడెసివిర్‌ను దేశంలో హెటిరో, సిప్లా, మైలాన్, జుబిలెంట్ లైఫ్ సైన్సెస్ సంస్థలు తమతమ కంపెనీల ద్వారా పంపిణీ చేస్తున్నాయి.

Remdesivir drug price rs 2800

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News