Friday, May 10, 2024

నీట్ యుజి అడ్మిట్ కార్డులు విడుదల

- Advertisement -
- Advertisement -

Release of NEET UG Admit Card 2021

12న పరీక్ష నిర్వహణ

మనతెలంగాణ/హైదరాబాద్ : నేషనల్ ఎంట్రన్స్ కమ్ ఎలిజిబిలిటీ టెస్ట్ అండర్ గ్రాడ్యుయేట్ (నీట్ యుజి 2021) అడ్మిట్ కార్డులను నేషనల్ టెస్టింగ్ ఏజెన్సీ విడుదల చేసింది. విద్యార్థులు ఎన్‌టిఎ అధికారిక వెబ్ సైట్ neet.nta.nic.in నుంచి అడ్మిట్ కార్డులను డౌన్‌లోడ్ చేసుకోవచ్చు. వెబ్‌సైట్‌లో విద్యార్థి అప్లికేషన్ నెంబర్, పుట్టిన తేది, సెక్యూరిటీ కోడ్ నమోదు చేసి అడ్మిట్ కార్డులను డౌన్‌లోడ్ చేసుకోవాలి. ఈ నెల 12వ తేదీ(ఆదివారం) దేశవ్యాప్తంగా నీట్ యుజి పరీక్షను నిర్వహించనున్నారు. సెప్టెంబర్‌లో ఇతర పరీక్షలు ఉన్న నేపథ్యంలో నీట్ వాయిదా వేయాలని బోర్డుకు అభ్యర్థనలు వచ్చినప్పటికీ, సుప్రీం కోర్టు ఆదేశాల మేరకు గతంలో ప్రకటించిన తేదీకి పరీక్ష జరుపుతున్నారు.

 

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News