Tuesday, April 30, 2024

కొండపోచమ్మకు లైన్ క్లియర్

- Advertisement -
- Advertisement -

Kondapochamma reservoir

 

రిజర్వాయర్‌లోకి నీటి విడుదలకు మార్గం సుగమం
పాత ఆదేశాలను ఎత్తివేసిన హైకోర్టు
4న సిఎం కెసిఆర్ చేతుల మీదుగా జలకళ సంతరించుకోనున్న జలాశయం

మన తెలంగాణ/హైదరాబాద్ : సిద్దిపేట జిల్లాలోని కొండపోచమ్మకు నీటిని విడుదల చేసేందుకు మార్గం సుగమమం అయ్యింది. ఇంతవరకూ నీటిని విడుదల చేయరాదన్న హై కోర్టు నేడు ఆ ఉత్తర్వులను ఎత్తేసింది. దీంతో ఈ నెల 4న సిఎం చంద్రశేఖర్‌రావు చేతుల మీదుగా రిజర్వాయర్ నుంచి నీటిని విడుదల చేసేందుకు అడ్డంకులు అన్నీ తొలగిపోయాయి. ఈ మేరకు శుక్రవారం ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ ఆర్‌ఎస్ చౌహాన్, న్యాయమూర్తి జస్టిస్ ఎ.అభిషేక్‌రెడ్డిలతో కూడిన డివిజన్ బెంచ్ ఉత్తర్వులు జారీ చేసింది. ములుగు మండలం మామిడ్యాల, బాహిలాంపూర్ గ్రామాలకు చెందిన ముంపు బాధితులు వేసిన రిట్లలో గతంలోని నీటి విడుదల చేయరాదన్న ఉత్తర్వుల్ని రద్దు చేయాలని సర్కార్ తరఫున అడ్వకేట్ జనరల్ బీఎస్ ప్రసాద్ కోరడంతో అందుకు హైకోర్టు సమ్మతించింది. అంతే కాకుండా నీటి విడుదల కాకుండా చేయాలన్న పిటిషనర్ లాయర్ వినతిని తోసిపుచ్చింది. ప్రజాప్రయోజనాల్ని దృష్టిలో పెట్టుకోవాలని నొక్కి చెప్పింది.

ఎంతమందో రైతులు తమ భూములు సాగు కావాలని కలలు కంటున్నారని, తాగు నీటి సమస్య శాశ్వతంగా ఆప్రాంతంలో పరిష్కారం అవుతుందని హైకోర్టు వ్యాఖ్యానించింది. అయినా ఒకసారి అవార్డు జారీ అయ్యాక తాము జోక్యం చేసుకోలేమంది. నీటిని విడుదల చేయడం ఆ ప్రాంత స్వరూపమే మారిపోతుందని అభిప్రాయపడింది. ఇదే సమయంలో ముంపు బాధితులకు పరిహారం, పునరావాసం కల్పించాలని తేల్చి చెప్పింది. వారికి చెరువు ఎల్‌టీఎఫ్ పరిధిలో కాకుండా గజ్వేల్‌లో రెండు పడక గదుల గృహాలు ఇవ్వాలని ఆదేశాలిస్తామని చెప్పింది.రైతుల పంటల్ని కాపాడాలని, కోతకు రాబోయే పంటలకు కూడా పరిహారం చెల్లించాలని ఆదేశించింది. ఏజీ ప్రసాద్ వాదిస్తూ రిజ ర్వాయర్ నిర్మాణం అయ్యిందని, 97 శాతానికి పరిహారం ఇచ్చామని, మిగిలినవారికీ ఇచ్చేస్తామని చెప్పారు. పిటిషనర్ లాయర్ వాదిస్తూ, హైకోర్టు తుది ఉత్తర్వులు ఇచ్చే వరకూ నీటి విడుదల చేయరాదన్న వినతిని హైకోర్టు తోసిపుచ్చింది.

ప్రాజెక్టు వల్ల ప్రజాప్రయోజనాలను దృష్టిలో పెట్టుకోవాలని చెప్పింది. కొందరి కోసం ప్రాజెక్టులను ఆపకుండా ఉండలేమని తేల్చి చెప్పింది. ఇదే సమయంలో పిటిషనర్ లాయర్ చెప్పిన విషయాలపై హైకోర్టు సిద్దిపేట కలెక్టర్, ఆర్‌డివోలకు హైకోర్టు మండిపడింది.మే 1 వరకూ హైకోర్టు గడువు ఉన్నా అధికారులు ఏప్రిల్ 30 రాత్రి 600 వందల మంది పోలీసులతో ఇళ్లను ఎందుకు ఖాళీ చేయించాల్సివచ్చిందని ప్రశ్నించింది. బలవంతంగా బాధితులను ఖాళీ చేయించిన కలెక్టర్, ఆర్డీవోల తీరును తప్పుపట్టింది. ప్రజాస్వామ్యంలో ఉన్నాం. దౌర్జన్యాలకు పాల్పడితే నక్సలిజం వైపు పిల్లలు చూస్తారు. పిల్లల ముందే అధికారులు ఆ విధంగా పెద్దల్ని చేస్తే వారు ప్రభుత్వాలపై ఎదురుతిరుగుతారు. ఇదేనా అధికారులు వ్యవహరించాల్సిన విధానం. ఇది సరికాదు. ఆ జిల్లా అదనపుజడ్జి దీనిపై బాధితులతో మాట్లాడి నివేదిక ఇవ్వాలి. విచారణను ఈ నెల 7నజరుపుతాం.. అని హైకోర్టు ఆగ్రహం వ్యక్తం చేసింది.

 

Release of water to Kondapochamma reservoir
- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News