Monday, April 29, 2024

డేరింగ్ సంస్కరణలు

- Advertisement -
- Advertisement -

Minister KTR

 

ఆర్థిక వ్యవస్థ గాడిలో పడాలంటే తక్షణమే చర్యలు
భారీ పారిశ్రామిక పార్కులు ఏర్పాటు చేయాలి
పాత కాలపు కార్మిక, దివాళా చట్టాలను మార్చాలి
ఎంఎస్‌ఎంఇలకు నేరుగా ఆర్థిక సాయం చేయాలి
బకాయిల వసూలుకు కొంత విరామం అవసరం
కేంద్ర మంత్రి పీయూష్‌గోయల్‌కు మంత్రి కెటిఆర్ లేఖ

మన తెలంగాణ/హైదరాబాద్ : దేశంలో ఆర్ధిక వ్యవస్థ తిరిగి గాడిలో పడాలంటే కేంద్రం తక్షణమే పలు సాహాసోపేతమైన నిర్ణయాలు తీసుకోవాల్సిన అవసరముందని రాష్ట్ర ఐటి, పరిశ్రమల శాఖ మంత్రి కెటిఆర్ అన్నారు. కరోనా మహమ్మారి కారణంగా దేశంలో ఆర్ధిక వ్యవస్థ చిన్నాభిన్నమైన నేపథ్యంలో కేంద్రం మరిన్ని బోల్డ్ నిర్ణయాలు తీసుకోవాల్సి ఉంటుందని అభిప్రాయపడ్డారు. ప్రస్తుత లాక్‌డౌన్ పరిస్థితులు ఎత్తేసిన అనంతరం ఈ సంక్షోభ సమయంలో ఉన్న కొత్త అవకాశాలను అందుకోవాల్సిన అవసరమున్నదన్నారు.ఈ అంశాలపై సవివరంగా వివరిస్తూ కేంద్ర మంత్రి పీయూష్ గో యల్‌కు శుక్రవారం మంత్రి కెటిఆర్ ఒక లేఖ రాశారు. దేశంలోకి మరిన్ని పెట్టుబడులను తీసుకురావడంతో పాటు ఆర్థిక వ్యవస్థను తిరిగి గాడిలో పెట్టేందుకు అవసరమైన కొన్ని సూచనలను తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వ పక్షానా ఈ లేఖ లో కెటిఆర్ పేర్కొన్నారు. కరొనా వైరస్ మహమ్మారిని అన్ని రాష్ట్ర ప్రభుత్వాలతో కలిసి సమిష్టిగా ఎదుర్కొంటున్న నేపథ్యంలో ప్రభుత్వ వి ధానాల్లో కేంద్రం సమూల మార్పులు తీసుకురా zవాలని సూచించారు.

ముఖ్యంగా ఈజ్ ఆఫ్ డూయింగ్ బిజినెస్ ర్యాంకింగ్‌లో ప్రపంచంలో నే టాప్ 20 జాబితాలోకి తీసుకువచ్చేందుకు ఉండే పలు నిర్ణయాలు తీసుకోవాలన్నారు. దేశ ంలో పాతపడిన లేబర్ లా తో పాటు బ్యాంకు రప్టసి (బ్యాంకు లోన్ల దివాళా) కు సంబంధించి న చట్టాలను సమూలంగా మార్చాల్సిన అవస రం ఉందని మంత్రి కెటిఆర్ పేర్కొన్నారు. దీంతో పాటు ప్రభుత్వాలకు మార్పుకు సంబంధం లేకుండా పెట్టుబడుల పట్ల స్థిరమైన, ఖచ్చితమైన, నమ్మకమైన విధానాలు ఉండేలా చూడాలన్నారు. భారతదేశంలో మౌలిక వసతులు, నైపు ణ్య అభివృద్ధి పైన ప్రత్యేక శ్రద్ధ వహించాల్సిన అవసరం ఉన్నదన్నారు. ఇందుకోసం మెగా ఇండస్ట్రీయల్ పార్కు అయినటువంటి హైదరాబాద్ ఫార్మా సిటి, కాకతీయ మెగా టెక్సటైల్స్ పార్కు వంటి వాటికున్న జాతీయ ప్రాధాన్యతను అర్థం చేసుకొని వాటికి మద్దతు ఇవ్వాల్సిన అవసరం ఉందన్నారు. దేశంలో భారీ ఇండస్ట్రియల్ పార్కులను ఏర్పాటు చేస్తూ అందులోనే అన్ని వసతులు ఉండేలా, శిక్షణ సంస్థలను ప్రపంచ స్థాయి ప్రమాణాలతో ఏర్పాటు చేయాలని మంత్రి కెటిఆర్ సూచించారు.

భారీ ఆర్థిక వ్యవస్థలకు ప్రపంచంతో పోటీ పడే ఇటువంటి వీలుంటుందని, ఆ దిశగా భారత దేశాన్ని ముందుకు తీసుకు పోవాల్సిన అవసరం ఉందన్నారు. ప్రపంచంలోని ఏ దేశంతో అయినా పోటీ పడే విధంగా భారతదేశ ఎగుమతుల యొక్క పోటీతత్వాన్ని మరింత పెంచాల్సిన అవసరం ఉందన్నారు. ముఖ్యంగా ఫార్మా రంగం, ఏరోస్పేస్, టెక్స్‌టైల్స్ , లెదర్, ఐటి, ఫుడ్ ప్రాసెసింగ్ రంగాలకు సంబంధించి ఈ విషయంలో ప్రాధాన్యత ఇవ్వాలన్నారు. భారతదేశంలోకి పెద్ద ఎత్తున పెట్టుబడులు తీసుకురావాలంటే ఎప్పటికప్పుడు ప్రపంచంలోని పెట్టుబడి అవకాశాలు పైన నిరంతరం పరిశీలన చేస్తూ, ఇతర దేశాలతో పోటీ పడి మరి ఇక్కడికి చేయాల్సిన అవసరం ఉందన్నారు. దేశంలోకి ఆయా పెట్టుబడులు వచ్చిన తర్వాత వారికి అవసరమైన శిక్షణను అంతర్జాతీయ ప్రమాణాలతో అందించాలన్నారు. వీటితో పాటు ఆయా పెట్టుబడులు భారతదేశంలోకి తరలివచ్చే అవసరమైన ప్రోత్సాహకాలను ముఖ్యంగా ఎగుమతులకు సంబంధించి ప్రోత్సాహకాలను అందించాల్సిన అవసరం ఉందన్నారు.

ప్రస్తుతం భారీ పెట్టుబడులను దేశంలోకి రప్పించడం తో పాటు దేశంలో అత్యధిక మందికి ఉపాధి కల్పించే సూక్ష్మ, మధ్య తరహా పరిశ్రమలకు కాపాడుకోవాల్సిన అవసరం ఉందని, భారతదేశ ఎస్‌ఎంఇలు ఆర్థిక వ్యవస్థ కి వెన్నుముక లాంటివని మంత్రి కెటిఆర్ అన్నారు. ప్రస్తుత ఆపత్కాలంలో సూక్ష్మ,మధ్య తరహా పరిశ్రమలకు నేరుగా ఆర్థిక సాయం అందించే అంశాన్ని పరిశీలించాలని అవసరమైతే ఆయా సంస్థలకు ఉన్నటువంటి బకాయిలకు వసూలుకు కొంత విరామం ఇవ్వాలని సూచించారు. ప్రస్తుతం దేశంలోని ఆర్థిక వ్యవస్థతో పాటు దేశానికి సంబంధించి రానున్న పెట్టుబడులు, పరిశ్రమల పైన ఒక ఎంపవర్డ్ స్ట్రాటజీ గ్రూప్ ఏర్పాటు చేయాలని ఇప్పటికే తెలంగాణ ప్రభుత్వం సూచించిందని ఈ విషయాన్ని పరిశీలించాలని కేంద్ర మంత్రిని ఆయన కోరారు. ఈ కమిటీలో కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాల ఉన్నతాధికారులతో పాటు ప్రముఖ పారిశ్రామిక వేత్తలు బ్యాంకర్లు, ఆర్థికవేత్తలు పాలసీ నిపుణులు ఉండాలని సూచించారు.

పబ్లిక్ ఎఫైర్స్ ఫోరమ్ ఆఫ్ ఇండియా సభ్యులతో వెబినార్ సమావేశం
పబ్లిక్ ఎఫైర్స్ ఫోరమ్ ఆఫ్ ఇండియా సభ్యులతో నిర్వహించిన వెబినార్ సమావేశంలో మంత్రి కెటిఆర్ పాల్గొన్నారు. దేశంలోని అనేక కార్పొరేట్ సంస్థల సీనియర్ ప్రతినిధులతో పాటు పబ్లిక్ పాలసీ రంగంలోని ప్రముఖులు సుమారు 70 మంది దేశంలోని వివిధ ప్రాంతాల నుంచి ఈ సమావేశంలో మంత్రితో సంభాషించారు. ఈ సందర్భంగా కరోనా వైరస్ కట్టడి కోసం తెలంగాణ ప్రభుత్వం చేపట్టిన పలు కార్యక్రమాలను, చర్యలను వివరించారు. దీంతోపాటు ప్రస్తుతం తెలంగాణ లో ఉన్న హెల్త్‌కేర్ రంగంలోని మౌలిక వసతులను కూడా ఈ సందర్భంగా మంత్రి ప్రస్తావించారు. రాష్ట్ర ప్రభుత్వం గత ఆరు సంవత్సరాల్లో అద్భుతమైన ప్రగతిని సాధించిందనీ రానున్న సంవత్సరాల్లో భారీ లక్ష్యాల సాధన కోసం పని చేస్తుందని ఈ సందర్భంగా మంత్రి కెటిఆర్ పేర్కొన్నారు. ప్రస్తుతం ఉన్న కరోనా వైరస్ సంక్షోభం లోనూ కొత్త అవకాశాలు ఉన్నాయని తాము భావిస్తున్నామని, ముఖ్యంగా భారత దేశ పారిశ్రామిక రంగం ఇలాంటి అవకాశాలను అందిపుచ్చుకునేందుకు సిద్ధంగా ఉండాలని సూచించారు.

ప్రస్తుత ఆపత్కాలంలో భారతదేశం గురించి ప్రపంచ దేశాలు అత్యంత సానుకూల దృక్పథంతో చూస్తున్నాయని ఈ అవకాశాన్ని ఉపయోగించుకోవాలని సూచించారు. కరోనా కట్టడి విషయంలో భారత దేశం ఇప్పటికే ప్రపంచ దేశాలకు ఒక బలమైన సందేశం ఇచ్చిందని, ఈ సందర్భంగా దేశానికి ఉన్న బలాలను ప్రపంచానికి ప్రదర్శించే అవకాశం దొరికిందన్నారు. రానున్న రోజుల్లో వీటిని ఉపయోగించుకొని ఫార్మా, ఎలక్ట్రానిక్స్ మరియు ఐటి వంటి రంగాల్లో వేగంగా ముందుకు పోవాలని కోరారు. తాము ఇప్పటివరకు హాజరైన సమావేశాలో ఒక అత్యుత్తమమైనది అని పలువురు మంత్రి కెటిఆర్‌కు తెలియజేశారు. ఈ సంక్షోభంలోనూ అద్భుతమైన ఆలోచనలతో ముందుకు తీసుకుపోయేలా ప్రయత్నిస్తున్నారని వారు మంత్రి కెటిఆర్‌ను అభినందించారు. పబ్లిక్ అఫైర్స్ ఫౌండేషన్ ఆఫ్ ఇండియా గౌరవ సభ్యులుగా ఉండాలని ఈ సందర్భంగా పలువురు మంత్రిని కోరారు.

 

Minister KTR letter to Minister Piyush Goyal
- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News