Sunday, May 5, 2024

అమరుల త్యాగాలను స్మరించుకోవాలి

- Advertisement -
- Advertisement -

భూపాలపల్లి : తెలంగాణ రాష్ట్ర సాధనలో ప్రాణా లర్పించిన అమరుల త్యాగాలను ప్రతి ఒక్కరూ స్మరిం చుకోవాలని భూపాలపల్లి ఎంఎల్‌ఏ గండ్ర వెంకటరమణారెడ్డి అన్నారు. తెలంగాణ రాష్ట్ర దశాబ్ది ఉత్సవాల చివరి రోజుల్లో భాగంగా గురువారం భూపాలపల్లి నియోజకవర్గ కేంద్రంలోని అంబేద్కర్ చౌరస్తా వద్ద గల అమరుల స్థూపం వద్ద నిర్వ హించిన అమరుల సంస్మరణ దినోత్సవంలో భూపాలపల్లి ఎం ఎల్‌ఏ గండ్ర వెంకటరమణారెడ్డి జిల్లా కలెక్టర్ భవేశ్ మిశ్రాతో కలిసి అమరవీరుల స్థూపంకు పూలమాలలు వేసి ఘనంగా నివాళులు అర్పించారు.

ఈ సందర్భంగా భూపాలపల్లి ఎంఎల్‌ఏ గండ్ర వెంకటరమణారెడ్డి మాట్లాడుతూ 14 సంవత్సరాల పా టు సిఎం కెసిఆర్ నాయకత్వంలో జరిగిన తెలంగాణ ఉ ద్యమంలో అన్ని వర్గాల వారు పాల్గొన్నారని, ప్రొఫెసర్ జ యశంకర్, కొండా లక్ష్మణ్ బాపూజీ వంటి మహనీయుల సూ చనలతో సిఎం కెసిఆర్ తెలంగాణ ఉద్యమ వేడిని ఢిల్లీకి తాకే విధంగా పోరాడారని ఆయన పేర్కొన్నారు. ప్రత్యేక తెలంగాణ రాష్ట్రం అమరులు త్యాగఫలం, అనేక మంది ఉద్యమకారులు చేసిన త్యాగాల ఫలితంగా ఏర్పడిందని, వీరి త్యాగాలను మనం నిరంతరం స్మరించుకుంటు వారి ఆశయ సాధనకు ఐక మత్యంతో కృషి చేయాలని ఆయన తెలిపారు. హైదరాబాద్‌లో అద్భుతంగా అమరుల స్మారక చిహ్నాన్ని నిర్మించి వారి త్యాగాలు శాశ్వతంగా నిలిచిపోయే విధంగా సిఎం కెసిఆర్ నాయకత్వంలో ప్రభుత్వం చర్యలు తీసుకుంటుందని అన్నారు.

కలెక్టర్ భవేశ్ మిశ్రా మాట్లాడుతూ ప్రత్యేక రాష్ట్రం ఏర్పడి 9 సంవత్సరాలలో సాధించిన ప్రగతిని వివరిస్తూ గత 20 రోజులుగా జిల్లాలోని ప్రతి గ్రామంలో మున్సిపాలిటీలో వివిధ శాఖల ద్వారా దశాబ్ది ఉత్సవాలను ఘనంగా నిర్వహించామని అన్నారు. రాష్ట్ర దశాబ్ది ఉత్సవాల సందర్భంగా వివిధ శాఖల ద్వారా దేశానికి ఆదర్శంగా రాష్ట్రంలో జరుగుతున్న పాలనను వివరించామని, అన్ని రంగాలలో రాష్ట్రం అభివృద్ధి సాధిస్తూ అమరుల ఆశా సాధన దిశగా పయనిస్తుందని కలెక్టర్ తెలిపారు. ఈ కార్యక్రమంలో అదనపు కలెక్టర్ దివాకర, భూపాలపల్లి మున్సిపల్ చైర్‌పర్సన్ వెంకట్రామి సిద్దు, జిల్లా పరిషత్ వైస్ చైర్‌పర్సన్ కేశవ, జిల్లా గ్రంథాలయ సంస్థ చైర్మన్ బి రమేష్‌గౌడ్, జిల్లా అధికారులు, కౌన్సిలర్లు, ప్రజా ప్రతి ని ధులు, ప్రజలు, సిబ్బంది, తదితరులు పాల్గొన్నారు.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News