Friday, May 3, 2024

షర్మిలది రాజకీయ అవకాశవాదం: రేణుకా చౌదరి వ్యాఖ్య

- Advertisement -
- Advertisement -

న్యూఢిల్లీ: ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి వైఎస్ జగన్‌మోహన్ రెడ్డి సోదరి వైఎస్ షర్మిల తాను ఏర్పాటు చేసిన వైఎస్‌ఆర్ తెలంగాణ పార్టీ(వైఎస్‌ఆర్‌టిపి)ని కాంగ్రెస్ పార్టీలో విలీనం చేయనున్నట్లు వెలువడుతున్న వార్తలపై కాంగ్రెస్ పార్టీ సీనియర్ నాయకురాలు, మాజీ ఎంపి రేణుకా చౌదరి శుక్రవారం స్పందించారు. తన రాజకీయ ఉనికిని కాపాడుకునేందుకు వైఎస్ షర్మిల రాజకీయ అవకాశవాదానికి పాల్పడుతున్నారంటూ రేణుకా చౌదరి విమర్శించారు. కాంగ్రెస్ పార్టీలో వైఎస్‌ఆర్‌టిపి విలీనం కాంగ్రెస్ పార్టీపై ప్రతికూల ప్రభావం చూపే ప్రమాదం ఉందని ఆమె ఆందోళన వ్యక్తం చేశారు.

తన వైఎస్‌ఆర్‌టిపిని కాంగ్రెస్‌లో విలీనం చేయడానికి ప్రయత్నాలు సాగుతున్నాయంటూ వస్తున్న ఊహాగానాల గురించి ప్రస్తావిస్తూ ఇది తన రాజకీయ ఉనికిని కాపాడుకునేందుకు షర్మిల చేస్తున్న ప్రయత్నంగా రేణుకా చౌదరి అభివర్ణించారు. కాంగ్రెస్ పార్టీ గంగా నదిలాంటిదని, ఇందుకు స్నానం చేయడానికి అందరూ వస్తారని ఆమె వ్యాఖ్యానించారు. రానున్న రోజుల్లో ఏం జరుగుతుందో వేచి చూద్దామంటూ ఆమె అన్నారు. మా అధ్యక్షురాలి గురించి, మా నాయకుల గురించి తప్పుడు మాట్లాడిన తర్వాత ఇప్పుడు మా పార్టీలో తన పార్టీని విలీనం చేయాలనుకోవడం వెనుక కొత్తగా ఏ జ్ఞానోదయం కలిగిందని ఆమె వ్యాఖ్యానించారు.

మా పార్టీ గురించి అవాకులు చెవాకులు పేలాలరని ఆమె అన్నారు. ఈ విలీనం వల్ల కాంగ్రెస్‌కు లాభం చేకూరుతుందా అన్న విలేకరుల ప్రశ్నకు కాంగ్రెస్‌లోకి ఎవరు వచ్చినా వారికే ప్రయోజనమని ఆమె చెప్పారు. మా పార్టీ గంగా నదిలాంటిది. ఇందులో పుణ్య స్నానం చేసి తమ పాపాలు కడుక్కుంటారు. అయితే గంగానదికి ఎటువంటి పాపం అంటదు..అదే కాంగ్రెస్ గొప్పదనం అంటూ రేణుక వ్యాఖ్యానించారు.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News