Saturday, April 27, 2024

డిబేట్‌లో దిట్ట.. ఫండ్‌లో మేటి

- Advertisement -
- Advertisement -

వాషింగ్టన్ : అమెరికా అధ్యక్ష పదవికి రిపబ్లికన్ అభ్యర్థిలో వివేక్ రామస్వామి తమ ప్రాబల్యం చాటుకుంటున్నారు. ఈ కీలక పదవికి పోటీలో తొలి ప్రైమరీ చర్చలో ఈ ఇండో అమెరికన్ మల్టీమిలియనీరు అయిన బయోటెక్ అధినేత రామస్వామి ఆకర్షణీయ రీతిలో రేస్‌లో ముందుకు వచ్చారు. తరువాత జరిగిన ఆన్‌లైన్ ఫండ్‌రైజింగ్‌లో ఆయన 4,50,00ంకు పైగా డాలర్ల నిధిని సమీకరించారు. 38 సంవత్సరాల రామస్వామి బుధవారం నాటి డిబేట్ తరువాత గంట వ్యవధిలోనే ఇంత భారీ మొత్తం పార్టీకి విరాళంగా పోగుచేయగలిగారు. ఇప్పుడు ఆయన సాధించిన ఫండ్ సగటున చూస్తే మొత్తం ఓటర్ల శాతంలో 38 డాలర్లుగా నిలిచింది.

ఇప్పుడు ఈ పారిశ్రామికవేత్తకు రాజకీయంగా ముగ్గురు సొంతపార్టీ ప్రత్యర్థులు న్యూజెర్సీ మాజీ గవర్నర్ క్రిస్ క్రిస్టియిస్, మాజీ ఉపాధ్యక్షులు మైక్ పెన్స్, సౌత్ కరోలినా గవర్నర్ నిక్కీ హేలీ నుంచి తీవ్రస్థాయి పోటీ ఉంది. ఎన్నికల ఫలితాల తారుమారు కేసు, ఇప్పుడు అరెస్టుతో మాజీ అధ్యక్షులు ట్రంప్ ఈ రేస్‌కు తాత్కాలికంగా దూరమయ్యారు. ఈ దశలో జిఒపి డిబేట్‌లో రామస్వామి తన స్థానం పదిలపర్చుకున్నారని పాపులర్ యాక్సిస్ విశ్లేషించింది. తొలి డిబేట్‌లో ఆయన సమాధానాల తీరు పట్ల మొత్తం మీద 28 శాతం బాగుందనే స్పందించారు. తరువాతి స్థానంలో ఫ్లోరిడా గవర్నర్ రాన్ డిసాంటిస్‌కు 27 శాతం, పెన్స్‌కు 13 శాతం, హేలీకి కేవలం ఏడు శాతం సుముఖత దక్కింది.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News