Saturday, April 27, 2024

లిక్కర్ షాపుల కేటాయింపులో రిజర్వేషన్లు

- Advertisement -
- Advertisement -
Reservation in allocation of liquor shops
ఉత్తర్వుల జారీ చేసిన ప్రభుత్వం

హైదరాబాద్: రాష్ట్రంలో ఏ-4 కేటగిరిలో లిక్కర్ షాపుల కేటాయింపులో గౌడ్ లకు 15 శాతం, షెడ్యూల్డు కులాలకు (ఎస్సీలకు) 10 శాతం, షెడ్యూల్డు తెగలకు (ఎస్టీలకు) 5 శాతం రిజర్వేషన్‌లను కేటాయిస్తూ ప్రభుత్వం ఉత్తర్వులను జారీ చేసింది. ఇటీవల జరిగిన రాష్ట్ర మంత్రివర్గ సమావేశంలో తీసుకున్న నిర్ణయం మేరకు ప్రభుత్వం జీఓను 87 మంగళవారం విడుదల చేసింది. తెలంగాణా ఎక్సైజ్ చట్టం 1968 లోని సెక్షన్ 17 (1 ) (V ) అనుసరించి ప్రభుత్వ ఏ- 4 రిటైల్ షాపుల లైసెన్సులను 2021 నుంచి -23 సంవత్సరానికి గాను రిజర్వేషన్లను కేటాయిస్తున్నట్టు ఆ ఉత్తర్వులో ప్రభుత్వం పేర్కొంది. దీనిలో భాగంగా గౌడ్‌లకు 15 శాతం, షెడ్యూల్డు కులాలకు 10 శాతం, షెడ్యూల్డు తెగలకు 5 శాతం కేటాయిస్తూ ఇచ్చిన జీఓపై తగిన చర్య తీసుకోవాల్సిందిగా ప్రొహిబిషన్ ఎక్సైజ్ శాఖ డైరెక్టర్ ను ఆదేశిస్తూ ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేసింది.

అన్ని కులాల అభివృద్ధి కోసం ముఖ్యమంత్రి కృషి: మంత్రి శ్రీనివాస్‌గౌడ్

ఎస్సీ, ఎస్టీ, బిసిలు ఆర్థికంగా బలపడేందుకు వైన్ షాపుల కేటాయింపులో రిజర్వేషన్లు కల్పించి రాష్ట్ర ముఖ్యమంత్రి కెసిఆర్ చారిత్రాత్మక నిర్ణయం తీసుకున్నారని మంత్రి శ్రీనివాస్‌గౌడ్ పేర్కొన్నారు. రాష్ట్ర ఎస్సీ, ఎస్టీ, బిసి ఉద్యోగ సంఘాల, తెలంగాణ గెజిటెడ్ ఉద్యోగుల కేంద్ర సంఘం (టిజిఓ) ఆధ్వర్యంలో రాష్ట్ర అబ్కారీ, క్రీడా, పర్యాటక, సాంస్కృతిక శాఖ మంత్రి శ్రీనివాస్ గౌడ్‌ను ఈ విషయమై కలిసి కృతజ్ఞతలు తెలియజేసింది. టిజిఓ కేంద్ర సంఘం అధ్యక్షురాలు మమత ఆధ్వర్యంలో ఉద్యోగులు మంత్రి శ్రీనివాస్ గౌడ్‌ను ఘనంగా సన్మానించారు.

ఈ సందర్భంగా మంత్రి మాట్లాడుతూ ఎస్సీ, ఎస్టీ, బిసి, మైనారిటీలు ఆర్థికంగా బలపడాలన్న ఉద్ధేశంతో సిఎం కెసిఆర్ రాష్ట్రంలో 1000 గురుకులాలను ఏర్పాటు చేయడం జరిగిందన్నారు. అన్ని కులాల అభివృద్ధి కోసం ముఖ్యమంత్రి కృషి చేస్తున్నారని తెలిపారు. గొల్ల, కురుమలకు గొర్లు ఇవ్వడం ద్వారా వారి అభివృద్ధికి పాటుపడుతున్నారన్నారు. అన్ని రంగాల్లో రిజర్వేషన్లు కల్పించడం ద్వారా వారిని పైకి తీసుకురావాలన్న ఉద్దేశ్యంతో ముఖ్యమంత్రి కృషి చేయడం గొప్ప విశేషమన్నారు. ఇది దేశంలో పెద్ద మార్పును తీసుకు వస్తుందన్నారు. ఈ కార్యక్రమంలో టిజిఓ కేంద్ర సంఘం ప్రధాన కార్యదర్శి ఏ.సత్యనారాయణ, టిజిఓ కేంద్ర సంఘం నాయకులు సహదేవ్, వెంకటయ్య, ఎంబి కృష్ణ యాదవ్, గండూరి వెంకటేశ్వర్లు, హరికృష్ణ, సుభాష్ తదితరులు పాల్గొన్నారు.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News