Friday, April 26, 2024

సంక్రాంతి పండక్కి వెళ్లాలంటే కష్టమే

- Advertisement -
- Advertisement -
Reserved berths two months in advance of Sankranti
రెండు నెలలు ముందుగానే రిజర్వయిన బెర్తులు
ప్రత్యేక రైళ్ళే దిక్కు

హైదరాబాద్: సంక్రాంతి ప్రయాణానికి ఇంకా 34 రోజుల సమయం ఉంది. రైల్వేటికెట్ల బుకింగ్ కోసం అప్పుడే తొందరెందుకు. ఇంకా సమయం ఉందా కదా.. ట్రయిన్ టికెట్ బుక్‌చేసుకుందామనుకుంటే ప్పులుతో కాలేసినట్లే. గత సంవత్సరం సంక్రాంతి కరోనా భయంతో ఊరెళ్లని వారు సైతం వెళ్ళేవారు ముందస్తు జాగ్రత్తగా రెండు నెలలు ముందుగానే బుక్ చేసుకున్నారు.ఇప్పటికే సాధారణంగా నడిచే రైళ్ళలో సీట్లన్నీ భర్తీ అయ్యాయి. హైదరాబాద్ నుంచి సీమాంద్ర ప్రాంతానికి వెళ్ళే అన్ని ప్రధాన రైళ్ళలో వెయింటింగ్ జాబితా పెరిగిపోతుంది. సంక్రాంతి పండగ సందర్భంగా వెళ్ళిరావడానికి రిజర్వేషన్లు చేయించుకోవడంతో దాదాపు జనవరిలో నెలలోనే బెర్తులు లభించడం కష్టంగా మారింది. ఈ పరిస్థితుల్లో రైల్వేశాఖ ప్రత్యేకంగా పండగ స్పెషల్ రైళ్ళు నడిపితే తప్ప గ్రేటర్‌లో ఉన్న సీమాంధ్రులు సొంతూళ్ళకు వెళ్ళలేని పరిస్థితి నెలకొంది.

తెలుగు రాష్ట్రాల్లో సంక్రాతి పండుగకు ప్రత్యేక స్థానం ఉంటుంది. సీమాంద్ర ప్రాంతానికి చెంది ప్రజలు లక్షలాది మంది జీవనోపాధినిమిత్తం నగరంలో నివసిస్తున్నారు. ఈ సంవత్సరం ప్రారంభంలో కరోనా భయంతో ప్రజలు సొంతూళ్ళకు వెళ్ళలేని పరిస్థితులు నెలకొనగా ఈ సంవత్సరం మాత్రం సొంతూళ్ళకు వెళ్ళేందుకు రెండు నెలలు ముందుగానే ప్లాన్ చేసుకుంటున్నారు.దీంతో గత అనుభవాలను దృష్టిలో పెట్టకుని ముందస్తుగా రైల్వే బస్సులను టికెట్ రిజర్జ్ చేసుకుంటున్నారు. సాధారణంగా సీమాంద్ర ప్రాంతానికి నడిచే రైళ్ళలో ఇప్పటికే రిజర్వేషన్లు టికెట్లు పూర్తయ్యాయి. అంతే కాకుండా వెయిటింగ్ లిస్టు కూడా భారీగాను పెరుగుతోంది. సీమాంద్ర ప్రాంతాలకు వెళ్ళే గోదావరి, గౌతమి, గరీబ్ రథ్, ఫలక్‌నుమా,ఎల్‌టీటీ, కోణార్క్ తదితర రైళ్ళన్నింటిలో బెర్తులు నిండిపోగా వెయింటింగ్ లిస్ట్ కూడా భారీగానేపెరిపోయింది..

సాధారణంగా సంక్రతి పండగకు తెలంగాణ ప్రభుత్వం 10 నుంచి 16 వరకు సెలవులు ఇస్తుంది. ఏపీ మరో నాలుగు రోజులు ఎక్కువగానే ఇస్తుంది. ఈ నేపథ్యంలో హైదరాబాద్‌లో నివాసం ఉంటున్న, విజయవాడ, విశాఖపట్నం, గుంటూరు, ఉభయగోదావరి జిల్లాలతో పాటు ఓంగోలు, నెల్లూరు, జిల్లాలకు చెందిన ప్రజలతో పాటు, రాయలసీమ ప్రాంత వాసులు పండుగకు సొంతూళ్ళకు వెళ్ళేందుకు ముందస్తు ప్రణాళికులు చేసుకుని రిజర్వేషన్లు చేసుకున్నారు. రెగ్యులర్‌గా నడిచే రైళ్ళలో రోజువారీగా బెర్తులు దొరకడం కష్టంగానే ఉంటుంది. అలాంటిది పండగ కోసం మూడింతలు ప్రయాణికులు పెరుగుతారు.దీంతో కొంత మంది ముందు జాగ్రత్తగా రెండు నెలల ముందు నుంచే టికెట్ల రిజర్వ్ చేసుకుని ఊపరి పీల్చుకుంటుంటే. ఇంకా సమయం ఉందిలే అనుకుంటున్న వారికి సంక్రాంతి ప్రయాణ కష్టాలు తప్పేలా లేవు.

ఇదిలా ఉండగా హైదరాబాద్ నుంచి సీమాంద్రకు వెళ్ళే వారు మాత్రమే కాకుండా ఇతర ప్రాంతాల్లో నివాసం ఉంటున్న తెలంగాణ ప్రాంత వాసులు కూడా పండగలకు వచ్చేందుకు రిజర్వేషన్లు చేసుకుంటున్నారు. సంక్రాంతి పండగ తర్వాత తిరుగు ప్రయాణం కోసం జనవరి 16 నుంచి 20 వరకు రిజర్వేషన్లు పూర్తి చేసుకోవడంతో రైళ్ళలో బెర్తులు జనవరినెల మొత్తం దొరికే పరిస్థితి కనిపించడం లేదు. తంలో ఎన్నడూ లేని విధంగా సంక్రాంతి పండగకు ఊరేళ్ళేందుకు రెండు నెలలు ముందుగానే రిజర్వేషన్లు చేసుకుని బెర్తులు కన్‌ఫార్మ్ చేసుకుంటున్నారు. దీంతో ఎన్నడూ లేని విధంగా సీమాంద్ర ప్రాంతానికి వెళ్ళే రెగ్యులర్ ట్రైన్‌లో పాటు సీమాంద్ర మీదుగా వెళ్ళే రైళ్ళలో కూడా బెర్తులు నిండిపోయాయి. ఇటువంటి పరిస్ఠితుల్లో సీమాంద్ర ప్రాంతానికి చెందినవారు పండక్కి ఇళ్ళకు వెళ్ళాలంటే ప్రత్యేక రైళ్ళే దిక్కుగా కనిపిస్తున్నాయి.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News