Thursday, May 9, 2024

యుద్ధ ప్రాతిపదికన మేడిగడ్డ పునరుద్ధరణ

- Advertisement -
- Advertisement -

మనతెలంగాణ/హైదరాబాద్: కాళేశ్వరం ఎత్తిపోతల సాగునీటి పథ కంలో అత్యంత కీలకమైన మేడిగడ్డ లక్ష్మీబ్యారేజీ పునరుద్ధరణ పనులను యుద్ధప్రాతిపదికన పూర్తి చేసేందకు ప్రభుత్వం చర్యలు చేపట్టింది. ప్రాణ హిత నది గోదావరి నదిలో కలిసిన ప్రాంతానికి దిగువన ఉన్న మేడిగడ్డ వ ద్ద రాష్ట్ర ప్రభుత్వం ఈ బ్యారేజీని ని ర్మించింది. ఇక్కడ వర్షాకాలం తర్వా త కూడా నీటి అధికంగా ఉం డడంతో ఈ బ్యారేజీ కాళేశ్వరం ఎత్తి పోతల పథకానికి అత్యంత కీలకంగా మారింది. ఈ బ్యారేజీ నుంచే ఎగువన అన్నారం, సుందిళ్ల బ్యారేజీలకు నీటి ని ఎత్తిపోసి ఉత్తర తెలంగాణలోని అత ధిక ప్రాంతాలకు సాగు, తాగునీటిని అందించగలుగుతున్నారు. ప్రాధాన్యత గల మేడిగడ్డ బ్యారేజీకి సంబంధించి ఏడవ బ్లాకులో రెండు పిల్లర్లు ఆకస్మికంగా భూమిలోకి కొద్ది మేర కుంగిపోయాయి. దీంతో బ్యారే జీ ఏడవ బ్లాకునకు స్వల్పంగా నష్టం వాటిల్లింది.

ఈ నెల 21న జరిగిన ఈ ఘటనను రాష్ట్ర ప్రభుత్వం సీరియస్ గా తీసుకుంది. శాఖ అ ధికార యంత్రాగం సకాలంలో వేగం గా స్పందిచింది. బ్యారేజీలో నిల్వ ఉ న్న నీటిని గేట్ల ద్వారా దిగువకు వది లివేసింది. పిల్లర్ల కుంగుబాటుపై సమ గ్రంగా పరిశీలిన చేసిన అధికారులు ప్రభుత్వ ఆదేశాల మేరకు యుద్ద ప్రా తిపదికన బ్యారేజీ పనురుద్ధరణ పను లకు చర్యలు చేపట్టారు. ఏడవ బ్లాకు పరిధిలో  పిల్లర్లు కుంగుబాటకు సంబంధించి ఇప్పటికే సాంకేతికంగా అన్ని కోణాల అధ్యయనం చేశారు. ఈ బ్లాకు పరిధిలోని 16నుంచి20వరకు ఉన్న పిల్లర్లను పూర్తి స్థాయిలో పునరుద్ధరించేందుకు అవసరమైన ప్రణాళికను సిద్ధం చేశారు. పిల్లర్లను పునాది స్థాయి నుంచి పునరుద్ధరించేందకు అవసరమైన భారీ క్రేన్లు, ప్రొక్లైనర్లు, ఇతర యంత్రాలు, అందుకు అవసరమైన ఇతర సామగ్రిని సిద్ధం చేస్తున్నారు.

 

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News