Friday, April 26, 2024

కాంగ్రెస్ అధికారంలోకి వస్తే 2 లక్షల ఉద్యోగాల భర్తీ: రేవంత్

- Advertisement -
- Advertisement -

హైదరాబాద్ : పేపర్ లీకులతో నిరుద్యోగుల జీవితాలతో ప్రభుత్వం చెలగాటమాడుతోందని, కాంగ్రెస్ అధికారంలోకి వచ్చిన ఏడాది లోగా 2లక్షల ప్రభుత్వ ఉద్యోగ ఖాళీలను భర్తీ చేస్తాం పిసిసి అధ్యక్షుడు రేవంత్‌రెడ్డి అన్నారు. యాత్ర ఫర్ ఛేంజ్ పాదయాత్రలో భాగంగా శుక్రవారం ఆర్మూర్ నియోజకవర్గం పరిధిలోని పెర్కిట్ గ్రామం నుంచి ఆర్మూర్ వరకు పాదయాత్ర చేపట్టారు. అనంతరం ఆర్మూర్ పాత బస్టాండ్ వద్ద నిర్వహించిన జన సభలో ఆయన ప్రసంగించారు. గతంలో ఇక్కడ ప్రాతినిధ్యం వహించిన ఎమ్మెల్యేలు ఆర్మూర్‌కు కీర్తి తెచ్చారన్నారు. సురేష్ రెడ్డికి కాంగ్రెస్ అన్నీ ఇచ్చింది, స్పీకర్ ను చేసింది, కానీ సురేష్ రెడ్డి కాంగ్రెస్‌కు అన్యాయం చేశారని విమర్శించారు.

కాంగ్రెస్‌ను నట్టేట ముంచి నోళ్లు కొందరైతే కాంగ్రెస్ కార్యకర్తలను చంపించి ఎంఎల్‌ఎ అయినవారు ఇంకొకరన్నారు.గుత్ప, శ్రీరాం సాగర్ నిర్మించి రైతులు ఆత్మగౌరవంతో కాంగ్రెస్ బతికేలా చేసిందన్నారు. నిజామాబాద్ కు పసుపు బోర్డు తెస్తానని అరవింద్ మోసం చేశారని విమర్శించారు. కొత్త సంవత్సరంలో కాంగ్రెస్ పార్టీ అధికారంలో ఉంటుందని ఆశాభావం వ్యక్తం చేశారు. అధికారంలోకి వచ్చిన వెంటనే పేదలు ఇల్లు కట్టుకునేందుకు రూ.5 లక్షలు అందిస్తామని తెలిపారు. రాజీవ్ ఆరోగ్యశ్రీ ద్వారా రూ.5లక్షల వరకు వైద్య ఖర్చులు ప్రభుత్వమే భరిస్తుందన్నారు. రైతులకు రూ.2లక్షల రుణమాఫీ చేస్తామని తెలిపారు. రూ.500 లకే గ్యాస్ సిలిండర్ అందిస్తామన్నారు. కాంగ్రెస్ అధికారంలోకి వచ్చిన ఆరు నెలల్లో చక్కెర పరిశ్రమను తెరుస్తామని తెలిపారు.

ఇక్కడి గల్ఫ్ బాధితుల గోసలు చూస్తే కడుపు తరుక్కుపోతుందని ఆవేదన వ్యక్తం చేశారు. గల్ఫ్ బాధితులను ఆదుకునేందుకు రైతు బీమా మాదిరిగా గల్ఫ్ బీమా తీసుకొస్తామన్నారు. తద్వారా గల్ఫ్‌లో చనిపోయిన కార్మికుల కుటుంబానికి రూ.5 లక్షలు ఇన్సూరెన్స్ అందిస్తామన్నారు. ఇన్నీ మంచి పనులు చేయాలంటే తెలంగాణ కాంగ్రెస్ జెండా ఎగరాలన్నారు. ఇందిరమ్మ రాజ్యం రావాలి, ఇందిరమ్మ రాజ్యంతోనే రాష్ట్రంలో సంక్షేమ పాలన సాధ్యమవుతుందన్నారు.
లక్కంపల్లి సెజ్ ను సందర్శన
పాదయాత్ర కోసం ఆర్మూర్ వచ్చిన ఆయన శుక్రవారం నియోజకవర్గం పరిధిలోని నందిపేట్ మండలంలో ఉన్న లక్కంపల్లి సెజ్ ను సందర్శించారు. సెజ్ లోని ఆగ్రో ఫుడ్ పార్క్ లో సంబంధిత సిబ్బందిని కలిసి వివరాలు అడిగి తెలుసుకున్నారు. ఈ సందర్భంగా మీడియాతో మాట్లాడారు. 2008లో నందిపేట స్మార్ట్ ఆగ్రో ఫుడ్ పార్క్ కు యుపిఎ ప్రభుత్వం అనుమతి ఇచ్చింది. 421 ఎకరాల భూమిని సేకరించి పరిశ్రమల కోసం సెజ్ ను ఏర్పాటు చేసిందన్నారు.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News