Saturday, April 27, 2024

నేడు పిసిసి అధ్యక్షుడిగా రేవంత్ బాధ్యతలు

- Advertisement -
- Advertisement -

Revanth Reddy to take oath as TPCC Chief

మన తెలంగాణ/హైదరాబాద్: హైదరాబాద్ నాంపల్లిలోని గాంధీభవన్‌లో బుధవారం టిపిసిసి అధ్యక్షుడిగా రేవంత్‌రెడ్డి పదవీ బాధ్యతలు చేపట్టనున్నారు. దీంతో భారీ ఏర్పాట్లు చేస్తున్నారు. వాస్తు నిపుణుల సూచన మేరకు గాంధీభవన్‌లో పలు మార్పులు చేశారు. దీంతో గాంధీభవన్ సరికొత్తగా కనిపిస్తోంది. తన బాధ్యతల స్వీకారానికి రావాలని పార్టీ నేతలు, కార్యకర్తలకు రేవంత్ ఆహ్వానం పలికారు. కర్ణాటక వెళ్లి ప్రతిపక్ష నేత మల్లిఖార్జున ఖర్గే, కర్ణాటక మాజీ సిఎం సిద్ధరామయ్య, అక్కడి పిసిసి అధ్యక్షుడు డీకే శివకుమార్‌ను ఆహ్వానించారు. బుధవారం ఉదయం 10 గంటలకు జూబ్లీహిల్స్‌లోని పెద్దమ్మతల్లి గుడిలో రేవంత్‌రెడ్డి ప్రత్యేక పూజలు నిర్వహిస్తారు. 11 గంటలకు నాంపల్లి దర్గా వద్ద ప్రత్యేక ప్రార్థనలు చేసి గాంధీభవన్‌కు ర్యాలీగా బయల్దేరుతారు. 12.30 గంటలకు గాంధీభవన్ చేరుకుంటారు. మధ్యాహ్నం 1.30 నిమిషాలకు మాజీ పిసిసి అధ్యక్షులు ఉత్తమ్‌కుమార్‌రెడ్డి నుంచి పదవీ బాధ్యతలు స్వీకరిస్తారు. అక్కడ గాంధీభవన్ ఆవరణలో బహిరంగ సభలో మాట్లాడతారు. గాంధీభవన్‌లో జరిగే సమావేశం శాటిలైట్ లైవ్ లింక్ ఇవ్వడం జరుగుతుంది. కార్యక్రమాలను యూట్యూబ్ లింక్, ఫేస్ బుక్ లైవ్ ఇవ్వడం జరుగుతుంది.

Revanth Reddy to take oath as TPCC Chief

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News