Thursday, May 2, 2024

16 ప్రజా సంఘాలపై నిషేధం రద్దు

- Advertisement -
- Advertisement -

TS Govt lifted ban on 16 Public Communities

మనతెలంగాణ/హైదరాబాద్: రాష్ట్రంలో పదహారు ప్రజా సంఘాలపై నిషేధం ఎత్తివేస్తూ ప్రభుత్వం మంగళవారం కీలక నిర్ణయం తీసుకుంది. ఈక్రమంలో ప్రభుత్వం చట్ట వ్యతిరేక కార్యకలాపాలకు పాల్పడుతున్నట్లు ఆరోపణలు రావడంతో ఈ ఏడాది ఏప్రిల్ నెలలో 16 సంఘాలపై ప్రభుత్వం నిషేధం విధించింది. కాగా తాజాగా 16 సంఘాలను నిషేధం జాబితా నుంచి తొలగిస్తూ ఉత్తర్వులు జారీ చేసింది. వీటిలో తెలంగాణ ప్రజా ఫ్రంట్ (టిపిఎఫ్), తెలంగాణ అసంఘటిత కార్మిక సమాఖ్య (టిఎకెఎస్), తెలంగాణ విద్యార్థి వేదిక (టీవీవీ), డెమొక్రటిక్ స్టూడెంట్ ఆర్గనైజేషన్ (డిఎస్యూ), తెలంగాణ విద్యార్థి సంఘం (టివిఎస్), ఆదివాసి స్టూడెంట్ యూనియన్ (ఏఎస్యూ), రాజకీయ ఖైదీల విడుదల కమిటీ (సిఆర్‌పిపి), తెలంగాణ రైతాంగ సమితి (టిఆర్‌ఎస్), తుడుందెబ్బ (టిడి), ప్రజా కళా మండలి (పికెఎం), తెలంగాణ డెమొక్రటిక్ ఫ్రంట్ (టిడిఎఫ్), ఫోర్ అగైనెస్ట్ హిందూ ఫాసిజం అఫెన్సివ్, సివిల్ లిబర్టీస్ కమిటీ (పౌర హక్కుల సంఘం), అమరుల బంధు మిత్రుల సంఘం (ఎపిఎంఎస్), చైతన్య మహిళా సంఘం (పిఎంఎస్), రెవెల్యూషనరీ రైటర్స్ అసోసిషయేషన్ (విరసం)లపై ప్రభుత్వం నిషేధం ఏత్తివేసింది.

గతంలో ఈ సంస్థలు, సంఘాలు మావోయిస్టు పార్టీకి అనుబంధంగా ఉంటూ చట్టవ్యతిరేక కార్యకలాపాలకు పాల్పడుతున్నాయని ఆరోపణలు రావడంతో ప్రభుత్వం నిషేధం విధించింది. కాగా, ప్రభుత్వం నిషేధించిన ప్రజాసంఘాలు తెలంగాణ ఉద్యమంలో క్రియాశీలక పాత్ర పోషించాయని, తెలంగాణ ఏర్పడిన తర్వాత కూడా ప్రజా సమస్యలపై నిత్యం పోరాడుతూ, వాటి పరిష్కారానికై ప్రభుత్వాలకు వివిధ రూపాలలో విన్నవిస్తూ తమ పోరాటాన్ని కొనసాగిస్తున్నాయని పలువురు పేర్కొనడంతో ప్రభుత్వం ఆ దిశగా సమాలోచనలు సాగించింది. ఈక్రమంలో 16 సంఘాలపై నిషేధం ఎత్తివేస్తూ నిర్ణయం తీసుకోవడంతో పాటు ఉత్తర్వులు జారీ చేసింది.

TS Govt lifted ban on 16 Public Communities

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News