Monday, May 6, 2024

ఎసిబి వలలో మరో రెవెన్యూ ఉద్యోగి

- Advertisement -
- Advertisement -

ఎసిబి వలలో మరో రెవెన్యూ ఉద్యోగి
రూ.5వేల లంచం తీసుకుంటూ దొరికిన సర్వేయర్ సూపరింటెండెంట్

మనతెలంగాణ/హైదరాబాద్: కీసర తహసీల్దార్ నాగరాజు ఘటన మరువకముందే రంగారెడ్డి జిల్లా కలెక్టర్ కార్యాలయంలోని సర్వే అండ్ ల్యాండ్ రికార్డ్ విభాగంలోని సూపరింటెండెంట్ బొమ్మిరెడ్డి వెంకటేశ్వర్‌రెడ్డి రూ.5వేల రూపాయలు లంచం తీసుకుంటూ గురువారం ఎసిబికి దొరికిపోయాడు. వివరాల్లోకి వెళితే.. రంగారెడ్డి జిల్లా కలెక్టర్ కార్యాలయంలో బి.వెంకటేశ్వర్‌రెడ్డి అనే వ్యక్తి సర్వేయర్ సూపరిండెంట్‌గా విధులు నిర్వహిస్తున్నాడు. శంషాబాద్ తొండుపల్లిలోని 20 ఎకరాల స్థల వివాదంలో సరిహద్దులో గుర్తించేందుకు నగరంలోని ఖాజాగూడా నివాసి టివి వెంకటేశ్వరరెడ్డి సర్వే అండ్ ల్యాండ్ రికార్డ్ విభాగంలోని సూపరింటెండెంట్ బొమ్మిరెడ్డి వెంకటేశ్వర్‌రెడ్డి సంప్రదించారు. తనకు రూ.15వేల రూపాయలు ఇవ్వాలంటూ సదరు అధికారి లంచం డిమాండ్ చేశాడు.

దీంతో ఎసిబి అధికారులను ఆశ్రయించిన భూ యజమాని ప్రభుత్వ అధికారి వెంకటేశ్వరరెడ్డిపై ఫిర్యాదు చేశాడు. తొలివిడతగా బుధవారం నాడు 10వేల రూపాయల లంచం అందుకున్న వెంకటేశ్వర్‌రెడ్డి గురువారం మరో 5వేల రూపాయలు తీసుకుంటూ ఎసిబికి అడ్డంగా దొరికిపోయాడు. ఈ నేపథ్యంలో లంచం మొత్తం రూ. 5వేల తన ప్యాంట్ లో దాచినట్లు గుర్తించిన ఎసిబి అధికారులు సూపరింటెండెంట్ వెంకటేశ్వర్‌రెడ్డి చేతులకు, దుస్తులకు కెమికల్ పరీక్షలు నిర్వహించారు. అనంతరం వెంకటేశ్వరెడ్డి పనిచేస్తున్న కార్యాలయంతో పాటు అతని నివాసంలోనూ అధికారులు సోదాలు నిర్వహించారు. లంచం తీసుకుంటూ పట్టుబడిన సూపరింటెండెంట్ వెంకటేశ్వర్‌రెడ్డిని అరెస్ట్ చేసి ఎసిబి కోర్టులో హాజరుపరిచారు. దీంతో కోర్టు వెంకటేశ్వర్‌రెడ్డికి 14 రోజుల రిమాండ్ విధించింది.

Revenue employee in ACB net in Rangareddy

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News