Friday, April 26, 2024

సుశాంత్ రాసిన ‘కృతజ్ఞత జాబితా’

- Advertisement -
- Advertisement -

సుశాంత్ రాసిన ‘కృతజ్ఞత జాబితా’.. మీడియాకు షేర్ చేసిన రియా చక్రవర్తి

Rhea Chakraborty shares Sushant's thankful note

ముంబయి: బాలీవుడ్ నటుడు సుశాంత్ సింగ్ రాజ్‌పుత్ కేసులో మనీలాండరింగ్ ఆరోపణలపై ఎన్‌ఫోర్స్‌మెంట్ డైరెక్టరేట్(ఇడి) విచారణను ఎదుర్కొన్న అతని ప్రియనేస్తం, బాలీవుడ్ నటి రియా చక్రవర్తి శనివారం సుశాంత్‌కు సంబంధించిన కొన్ని జ్ఞాపకాలను మీడియాతో పంచుకున్నారు. సుశాంత్ తనకు కృతజ్ఞతలు చెబుతూ రాసిన ఒక పుస్తకంలోని పేజీని ఆమె షేర్ చేశారు. అంతేగాక చిచోరే చిత్రంలో సుశాంత్ వాడిన వాటర్ సిప్పర్ ఫోటోను కూడా ఆమె షేర్ చేస్తూ తన వద్ద ఉన్న సుశాంత్ ఏకైక ఆస్తి ఇదేనంటూ తెలిపారు. తన జీవితంలో ఈ ఏడుగురికి తాను కృతజ్ఞుడినంటూ సుశాంత్ రాసిన ఒక పుస్తకంలోని పేజీని రియా తన న్యాయవాది సతీష్ మనేషిండే ద్వారా మీడియాకు పంపారు.

Rhea Chakraborty shares Sushant's thankful note
ఆ పుస్తకంలో సుశాంత్ తనకు లభించిన ఈ జీవితానికి, లిల్లూకు, బేబూకు, సర్‌కు, మామ్‌కు, ఫడ్జ్‌కు, తన జీవితంలో తనకు లభించిన ప్రేమకు తాను కృతజ్ఞుడినంటూ కృతజ్ఞత జాబితా రాసుకున్నారు. ఈ పేజీ ఫోటోను షేర్ చేసిన రియా ఇది సుశాంత్ స్వహస్తాలతో రాసిన అక్షరాలని తెలిపారు. సుశాంత్ పేర్కొన్న వ్యక్తులను వివరిస్తూ..లిల్లూ అంటే షోయిక్(రియా సోదరుడు), బేబు అంటే నేను(రియా), సర్ అంటే నా తండ్రి, మామ్ అంటే మా అమ్మ, ఫడ్జ్ అంటే సుశాంత్ పెంపుడు శునకం అంటూ రియా తెలిపారు. అయితే ఈ రాతలు ఎప్పుడు రాశాడు, ఈ పుస్తకాన్ని ముంబయి పోలీసులకు అందచేశారా అన్న విషయంపై మనేషిండే వివరణ ఇవ్వలేదు.

Rhea Chakraborty shares Sushant’s thankful note

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News