Monday, April 29, 2024

రైస్ మిల్లర్లు ధాన్యాన్ని వెంటనే దింపుకోవాలి

- Advertisement -
- Advertisement -
  • సంగారెడ్డి కలెక్టర్ శరత్

సంగారెడ్డి: రైస్ మిల్లర్లకు కేటాయించిన ధాన్యాన్ని వెంటనే దింపుకోవాలని కలెక్టర్ శరత్ అన్నారు. బుధవారం కలెక్టరేట్ సమావేశ మందిరంలో సంబంధిత శాఖ అధికారులతో కలెక్టర్ సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా కలెక్టర్ మాట్లాడుతూ రైస్ మిల్లర్లు తమకు కేటాయించిన లక్షం మేరకు ధాన్యాన్ని వెంటనే దింపుకోవాలన్నారు. దాన్యం లారీలు దింపుకోని వారిపై చర్యలు తీసుకోవాలని డిఎస్‌ఓను ఆదేశించారు. ధాన్యం సకాలంలో దించుకోకుండా రైతులను ఇబ్బందులకు గురిచేస్తే కఠిన చర్యలు తీసుకుంటామని హెచ్చరించారు. హమాలీలను ఎక్కువ సంఖ్యలో ఏర్పాటు చేసుకొని ధాన్యం లారీలు వచ్చిన వెంటనే ఆన్‌లోడ్ చేయాలన్నారు.

రైస్ మిల్లులకు వెళ్లిన లారీలన్నీ ధాన్యం అన్‌లోడ్ అయిన వెంటనే తిరిగి నేరుగా కొనుగోలు కేంద్రాలకు వెళ్లాలన్నారు. ట్రాన్స్‌పోర్ట్ కాంట్రాక్టర్లు, తమ డ్రైవర్లకు కొనుగోలు కేంద్రానికి వెళ్లాలని ఖచ్చితమైన సూచనలివ్వలన్నారు. కొనుగోలు కేంద్రాలలోను సీరియల్ నంబర్ పాటించాలని ఎవరు మొదటగా కాంటా వేస్తారో వారిని లోడ్ చేసి రైస్ మిల్లులకు పంపాలని సూచించారు. ప్రతి రోజు లక్షం మేరకు ధాన్యాన్ని దింపుకోవాలని, రోజువారి నివేదికను మిల్లుల వద్ద ఉన్న పాయింట్ పర్సన్, డిప్యూటీ తహశీల్దార్ నుంచి రావాలన్నారు. లారీలు సక్రమంగా వెళ్లాలని డ్రైవర్లు సరిగ్గా ఉండేలా చూడాలని ట్రాన్స్‌పోర్ట్ కాంట్రాక్టర్లకు సూచించారు. తెలంగాణ రాష్ట్ర అవతరణ దశాబ్ది ఉత్సవాలను పురస్కరించుకొని ప్రతి రైస్ మిల్లువద్ద దశాబ్ది ఉత్సవాలప్లెక్సీ పోస్టర్‌ను ప్రదర్శించాలని కలెక్టర్‌కు సూచ్చిరు. అదే విధంగా పారిశ్రామిక దినాన్నీ నిర్వహించాలన్నారు. ఈ కార్యక్రమలో జిల్లా పౌరసరఫరాల అధికారి వనజాత, డిఎం సుగుణ భాయ్‌లున్నారు.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News